ఆధ్యాత్మిక సాధనకు, ఆరోగ్య పరిరక్షణకు దక్షిణాయనం
వరుస వ్రతాలు.. పెద్ద పెద్ద పండుగలు.. నవరాత్రులు.. ఇలా కోలాహలంగా సాగిపోయే కాలం వచ్చేస్తున్నది. ప్రతి నెలలోనూ పండుగలతో నిండి ఉన్న దక్షిణాయనం ఆగమిస్తున్నది. ఈ ఆరు మాసాల సమయం.. ఎన్నెన్నో పర్వాలు పలకరిస్తాయి. వీటి ఆంతర్యం గ్రహిస్తే మన ఆరోగ్య సాధనే అసలు రహస్యంగా కనిపిస్తుంది. కాలం పవిత్రమైనది. ప్రతి ఘడియా విలువైనదే! ప్రకృతి ధర్మాన్ని అతిక్రమించకుండా ఉండటానికి, కాల జాలాన్ని అర్థం చేసుకోవడానికి మన రుషులు ఎంతో...









