Articles

ArticlesNews

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్

( మే 7 - రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ) రవీంద్రనాథ్ ఠాగూర్ 7 మే 1861 (బంగ్లా సం.1268 వైశాఖ 25 ) న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ టాగూర్. రవీంద్రునిది బహుముఖ ప్రతిభ, సమాజ సమర్పిత జీవనం. వీరు గత శతాబ్దపు భారత సామాజిక, ధార్మిక,ఆధ్యాత్మిక పునరుజ్జీవన కాల ఖండంలో దీప స్తంభంగా నిలిచారు. వారి సాహిత్యం, ఆలోచనలు భారతీయ సనాతన, శాశ్వత విలువల ఆధారంగా నిలిచాయి. వారి జీవితమంతా ఈ విలువల అభివ్యక్తీకరణమే. మన ప్రాచీన చారిత్రక పరంపర పట్ల గౌరవభావం చూపకపోవడం అహంకారపూరితం, సిగ్గుచేటైన విషయమని ఆయన అనేవారు. ధర్మాన్నే అన్నింటికీ ఆధారంగా జాతి పునర్ నిర్మాణం చేయాలని ప్రయత్నించిన ఛత్రపతి శివాజీ త్యాగాలను, విజయాలను, సిక్కు గురువుల, బందాబైరాగి బలిదానగాథలను ఆయన శ్రద్ధాపూర్వకంగా వర్ణించారు. వారి వ్యాసాలన్నీ...
ArticlesNews

శ్రీరామ నామమే 1600 కిలోమీటర్లు నడిపించింది

ఎనిమిది పదుల వయస్సులో 1600 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు. అంతే కాకుండా మార్చ్ 16 నుండి ఏప్రిల్ 16 వరకు విపరీతమైన ఎండలో పాదయాత్ర అదేమీ అంత సామాన్యమైన విషయం కాదు. కానీ సంకల్పం ఉంటే ఏదైనా సాధించ వచ్చని నిరూపించారు. అంతే కాకుండా నా గొప్పతనమేమి లేదు అంతా ఆ శ్రీరామనామమే మమ్మల్ని 1600 కిలోమీటర్లు నడిపించిందని కృష్ణాపురం రామానందస్వామి చెబుతున్నారు అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలం పెదబారడ వంచాయితీ కృష్ణాపురం గ్రామం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ దామరాజు వెంకట రామ యోగీశ్వర గురు మహారాజు ఆశ్రమం (శ్రీ పాకాలపాడు గురుదేవుల) ఆశ్రమం పూజ్య శ్రీ రామానంద స్వామి వారి ఆధ్వర్యంలో విశ్వ శాంతి లోక కళ్యాణార్ధం సనాతన పరిరక్షణ కోసం కృష్ణాపురం నుంచి అయోధ్య...
ArticlesNews

బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి

( మే 7 - అల్లూరి సీతారామరాజు వర్థంతి ) భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే...
ArticlesNews

మలిసంధ్యలో మాధవ ధ్యానం

యౌవనం తొలిసంధ్య అనుకుంటే.. వార్ధక్యం మలిసంధ్య లాంటిది. ఆ మునిమాపు దశ నుంచి అనాయాసంగా నిష్క్రమించటానికి భగవంతుడి చరణాలే శరణ్యం. ఆధ్యాత్మిక చింతనే అత్యున్నత మార్గం. విషయానందం నుంచి బ్రహ్మానంద స్థితికి ఎంత త్వరగా చేరుకుంటే జీవిత చరమాంకంలో అంత ప్రశాంతతను...
ArticlesNews

స్మరణతో దైవసన్నిధి సాధ్యం

భాగవతంలో భగవంతుణ్ణి పొందటానికి సూచించిన నవవిధ భక్తి మార్గాల్లో స్మరణ ఒకటి. నిరంతర స్మరణతో దైవసన్నిధి సులభమవుతుంది. కానీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ అనేక ఆలోచనలు వస్తుంటాయి. వాటిని లక్ష్యపెట్టకుంటే ఎలా వస్తాయో అలాగే వెళ్లిపోతాయి. సాధకులు మనోనిగ్రహాన్ని అలవరచుకోవాలి. సదా...
ArticlesNews

వశిష్టుడు మొదలు, నేటి ఆధునికుల వరకు గోవును సేవించి ధన్యులైన వారెందరో

ఆవును సేవించే వారికి అతి దుర్లభమైన వరాలు కూడా నెరవేరుతాయి. క్రూరత్వం, కోపం చూపకుండా ఎప్పుడూ జాగ్రత్తగా సంరక్షిస్తే ఆవు అన్ని కోర్కెలు తీరుస్తుంది. జితేంద్రియుడై, ప్రసన్న చిత్తంతో నిత్యం గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది అని మహా భారతం అనుశాసన...
ArticlesNews

భారత రాతి చిత్రాల పితామహుడు డా. వీఎస్ వాకన్కర్

( మే 4 - డా. వీఎస్ వాకన్కర్ జయంతి ) భారత్‌లో రాక్ ఆర్ట్ (రాతి చిత్రాల) పితామహుడిగా పేరొందిన ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ వీఎస్ వాకన్కర్. 2003లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన భీంబేత్కా గుహలను కనుగొన్న అన్వేషి ఆయనే. 1919 మే 4వ తేదీన మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోని నీముచ్ టౌన్‌లో జన్మించిన విష్ణు శ్రీధర్ వాకన్కేర్… ఆర్కియాలజీ చదువుకొని భీంబేత్కా గుహల్లో ఉన్న రాతి చిత్రాలను గుర్తించారు. భోపాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో, వింధ్య పర్వతాల్లో ఉన్న ఈ గుహలను అప్పటి వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ గుహల్లో ఉన్న చారిత్రక సంపదను 1957లో ప్రపంచానికి వాకన్కేర్ చూపించారు. ఈ ప్రాంతంలో ఏడు పర్వతాల్లో 500కుపైగా గుహలున్నాయి. ఈ గుహలను కనుగొన్న తర్వాత తన జీవితాన్ని రాతి చిత్రాలు...
ArticlesNews

మహర్షి.. మయూరం

బరోడా మహారాణి బహూకరించిన తెల్లనెమలిని రమణ మహర్షి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. తన ఆసనం పక్కనే ఆ మయూరానికి గూడు కట్టించి, ‘ఒరే మాధవా!’ అంటూ ప్రేమగా పిలిచేవారు. వారిద్దరి అనుబంధాన్ని చూసి అందరూ ముచ్చటపడేవారు. ఒక భక్తుడైతే ఎంతో ప్రభావితుడై,...
ArticlesNews

పెరిగిన గోవు ప్రాధాన్యం…

భూమాతే గోమాత రూపంలో సంచరిస్తుందని పురాణ వచనం. గోమూత్రం, గోమయం పడగానే భూమి పులకరిస్తుందని చెబుతారు. పంటలకు కావాల్సిన 300 కోట్ల సూక్ష్మ జీవులను ఆవుపేడ పుట్టిస్తుందని అనేక మంది రైతుల స్వానుభవం. అనారోగ్యలను పారదోలడానికి గోమాత ప్రముఖ పాత్ర వహిస్తుంది....
ArticlesNews

ఉత్తరాఖండ్‌ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’

ఉత్తరాఖండ్ టూరిజం విభాగం దేశంలోనే తొలిసారిగా ఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించింది. అద్భుతాలను చూడాలని కోరుకునే ఔత్సాహికులే లక్ష్యంగా ‘నక్షత్ర సభ’ను లాంచ్‌ చేసింది. స్టార్‌స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు , ఆసక్తిగల ప్రయాణీకులకు...
1 230 231 232 233 234 350
Page 232 of 350