
– కరోనా కారణంగా అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. సంఘ కార్యక్రమాలు కూడా ఆగాయి.
– సంఘ కార్యం బాగా ఉంటే ప్రపంచం బాగా ఉంటుంది.
– ఆత్మ సాధన ఏకాంతంగా సాగించాలి. పరోపకారం ద్వారా లోకోద్ధరణ గావించాలి.
– దేశమంతటా ప్రార్థన సమయం నిశ్చయమైంది. కొందరు ప్రతిజ్ఞ కూడా స్మరించుకుంటున్నారు.
– మన కార్యానికి సమాజం యొక్క మద్దతు, ప్రోత్సాహం కూడా ఉంది.
– సమస్య ఉత్పన్నం కాగానే స్వయంసేవకులందరూ సేవా కార్యంలో నిమగ్నమయ్యారు.
– ప్రపంచాన్ని దుఃఖం నుంచి విముక్తం చేయడమే సంఘ కార్యం ఉద్దేశ్యం.
– కీర్తి కోసము, స్వార్థ భావనతో సేవ చేయరాదు.
– నా సమాజము, నా దేశము అన్న భావనతో సహజంగా సేవ చెయ్యాలి.
– నిరంతరం, నిరహంకారంగా సేవను కొనసాగించాలి.
– కరోనా లాక్ డౌన్ సమయంలో అధికారుల అనుమతితోనే, తగిన జాగ్రత్తలు తీసుకుని, సామాజిక దూరం పాటిస్తూ సేవా కార్యం కొనసాగించాలి.
– ఆందోళన అవసరం లేదు. మన సంకల్పం దృఢతరం కావాలి.
– ప్రశాంత హృదయంతో, యోజనా బద్ధంగా, ఆత్మవిశ్వాస పూరితంగా, భయము, అనుమానము లేకుండా పని చేయాలి.
– కనీసం మూడు అడుగుల దూరం పాటించాలి.
– అందరూ మనవారే. అందరితో స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా నడుచుకోవాలి.
– వాల్మీకి రామాయణంలో కార్య సాధన కోసం ధృతి, దృష్టి, మతి, దక్షత (సంసిద్ధత) ఉండాలని చెప్పబడింది.
– ఆయుష్ మంత్రాలయం సూచనలను పాటించాలి.
– సేవ చేయడంలో ప్రచార దుగ్ధ ఉండరాదు. సర్వాంగీణ ఉన్నతే మన లక్ష్యం. ప్రజా జీవనాన్ని సంరక్షించేలా మన పని సాగాలి. మరింత సంక్లిష్టం చేసేలా కాదు.
– సంక్షోభం కొనసాగినన్ని రోజులూ ఎన్ని రోజులు అవసరమైనా అన్ని రోజుల పాటు మన సేవను కొనసాగించాలి.
– విదురనీతిలో షట్ దోషా పురుషానేః…. అని చెప్పినట్లుగా కార్యసాధకుడు ఆరు దోషాలను దూరం చేసుకోవాలి.
– లాక్ డౌన్ కారణంగా ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో ప్రతి ఒక్కరికీ కొంత ఇబ్బంది ఉంటుంది. తప్పదు. అందుకు ప్రభుత్వాన్ని నిందించడం తగదు.
– కొందరు క్వారంటైన్ కి వెళ్లడానికి కూడా ఇబ్బంది ప/పెడుతున్నారు. భయమెందుకు?
– క్రోధాద్భవతి సమ్మోహః…. అన్నట్లుగా భయము వల్ల క్రోధము, క్రోధమువలన సమ్మోహితులమై విచక్షణను కోల్పోవటం జరుగుతుంది.
– మార్చి నెల నుంచి జూన్ వరకు సంఘ కార్యం కూడా పూర్తిగా ఆగిపోయింది. దీనికి ఎవరిని నిందిస్తాం? సర్కారు ఆపేసింది అంటామా?
– 130 కోట్ల మంది భారతీయులు భారతమాత సంతానమే. అందరూ మన బంధువులు. ఎవరి పట్లా అనుమానము, భయము, క్రోధము అవసరం లేదు.
– మహారాష్ట్రలో ఇద్దరు సన్యాసుల చర్చ జరిగింది – ధర్మాన్ని ఆచరించేవారు, ఆచరింప చేసేవారు ఇలా వేధింపబడడం ఆవేదనను కలిగించే విషయం.
– ఈ సంక్లిష్ట సమయంలో మనం సామాన్యులకు దిశా దర్శనం గావించాలి.
– విద్యాలయాలలో, పరిశ్రమలలో దూరం పాటిస్తూనే విధులు నిర్వహించవలసిన పరిస్థితి ఉంది.
– నిబంధనల పైన చర్చ అవసరం లేదు. స్వీయ అనుశాసనం పాటించాలి.
– ఈ సంకట స్థితి నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్ వ్యూహాలను రచించుకోవాలి, భవిష్యత్తును నిర్మించుకోవాలి.
– ఈ సమయంలో యుగానుకూల రచన అవసరం – ఆర్థిక, సామాజిక, సాంకేతిక ప్రగతి సాధించాలి. నవీన భారతావనికి పునాది నిర్మించాలి.
– స్వదేశీని ఆచరించాలి. దానివల్ల స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. నిర్మాణ రంగం వృద్ధి చెందుతుంది.
– లాక్ డౌన్ కారణంగా అన్ని నదులూ స్వచ్ఛతను పొందుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అంటే పర్యావరణం పరిశుద్ధం అవుతోంది. మన జీవనాన్ని కొంతైనా నియంత్రించుగలిగితే పర్యావరణ పరిరక్షణ గావించుకోవచ్చు. కుటుంబంలో కూడా ఇలాంటి సంస్కారాలను అలవరుచుకోవాలి.
– కుటుంబంలో అందరూ కూర్చుని చర్చించుకోవాలి. అందరూ ఒకే మనః స్థితిని పొందాలి. సంస్కారాలను పెంపొందించుకోవాలి. అనుశాసన బద్ధులం కావాలి.
– సోదరి నివేదిత భారతీయులు సామాజిక అనుశాసనం సాధించాలి అన్నారు.
– సమాజంలో సద్భావన నిర్మాణం కావాలి.
– అందరూ చట్టబద్ధంగా మనుగడ సాగించాలి
– పాలకులు, రాజకీయ నాయకులు చేసే శాసనాలు, నిర్ణయాలు సమాజ హితాత్మకంగా, దేశ హితాత్మకంగా ఉండాలి.
– మనందరం రెట్టించిన ఆత్మవిశ్వాసంతో దేశాన్ని విశ్వ గురుస్థానంలో నిలపడానికి సమైక్యంగా ప్రయత్నించాలి.
– సంపూర్ణ సమాజం యొక్క పరివర్తన మన లక్ష్యం.





