News

కరోనా రోగులకు ఆయుర్వేద చికిత్స!

698views

రోనా వ్యాధిగ్రస్థులపై తొలిసారి ఆయుర్వేద చికిత్స (క్లినికల్‌ ట్రయల్స్‌)ను ప్రారంభించేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. కరోనా రోగుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ‘ఫిఫట్రాల్‌’ అనే ఆయుర్వేద ఔషధాన్ని ప్రయోగించేందుకు బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యు) ప్రధాన పరిశోధకుడు డాక్టర్‌ కె.ఎన్‌.ద్వివేది నేతృత్వంలో కార్యాచరణ రూపొందించారు. దీన్ని కొవిడ్‌-19పై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యదళం (టాస్క్‌ఫోర్స్‌) పరిశీలనకు నివేదించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఇంకా అనుమతులు ఇవ్వలేదని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.