News

కరోనా కష్టకాలంలో వ్యాపారస్తులపై కరుణ చూపండి

928views

వన్నీ ఒకప్పుడు వేల సంఖ్యలో కస్టమర్లతో,వందల సంఖ్యలో ఉద్యోగులతో కళకళలాడినవే. రంగురంగుల విద్యుత్ దీపాలు, సెంట్రల్ ఏసి వంటి అనేక హంగులతో అందరినీ ఆకర్షించిన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కరోనా లాక్ డౌన్ కారణంగా నేడు వెలవెలబోతున్నాయి. ఏనుగు బ్రతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే అన్నట్టుగా వ్యాపారం ఉన్నా లేకపోయినా నిర్వహణ ఖర్చులు మాత్రం వారికి తప్పడం లేదు. ఆ నిర్వహణ ఖర్చు లే వారికి ఇప్పుడు తడిసి మోపెడువుతున్నాయి. లోకం దృష్టిలో వారు కోటీశ్వరులు. నిజానికి ఎన్నో కష్టనష్టాలకోర్చి వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండే వీరంతా ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

కరోనా కష్టకాలంలో వ్యాపారస్తులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. మామూలుగానే అనేక సమస్యల మధ్య తమ వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వ్యాపారస్తుల పరిస్థితి ప్రస్తుతం మరింత క్లిష్టంగా తయారయింది. లాక్ డౌన్ కారణంగా అసలు ఎలాంటి వ్యాపారమూ లేకపోయినా తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి తోపాటు కరెంట్ బిల్లులు, జిఎస్టి చెల్లింపులు, అడ్వాన్స్ టాక్స్ చెల్లింపులు చేయవలసిన పరిస్థితి. వ్యాపారాలు సాగని ఈ పరిస్థితులలో వ్యాపారస్తులకు ఇది అతి పెద్ద భారంగా మారుతుంది. వారి ఆర్ధిక స్థితిగతులపై పెను ప్రభావం చూపుతుంది.

ఇలాంటి విపత్కర ఈ పరిస్థితులలో వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతోకొంత ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సమస్యలను విన్నవిస్తూ, ఆ సమస్యలను అధిగమించడానికి తమకు జీఎస్టీ, అడ్వాన్స్ టాక్స్, విద్యుత్ బిల్లుల వంటి వాటిలో కొంత మినహాయింపునివ్వడం ద్వారా అండగా నిలువ వలసిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యాపారస్తులు కోరుతున్నారు. ఆ మేరకు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ నెల్లూరు, తిరుపతి, విజయవాడలలో గల శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత శ్రీ బయ్యా వాసు ‘నవరత్నాల’ పేరుతో ఒక వీడియో సందేశాన్ని అందించారు. అది గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో సందేశం VSK ఆంధ్రప్రదేశ్ పాఠకులకు ప్రత్యేకం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.