
అమెరికాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, అపోహలను తొలగించి, ప్రజలతో మరింత విస్తృతంగా మమేకం కావడమే లక్ష్యంగా ‘RSS ఫ్రెండ్స్’ పేరుతో ఓ సంస్థ అధికారికంగా ఏర్పాటైంది.అమెరికా విదేశీ ఏజెంట్ల రిజిస్ట్రేషన్ చట్టం (FARA) ప్రకారం ఆ దేశ న్యాయశాఖ వద్ద ఈ సంస్థ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా సమర్పించిన అధికారిక ఫైలింగ్‌లో న్యూఢిల్లీలోని కేశవ్కుంజ్లో ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను తమ ప్రధాన విదేశీ సంస్థగా పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
RSSపై అపోహల తొలగింపునకు ప్రత్యేక కార్యక్రమాలు
RSSకు సంబంధించి అమెరికాలో ప్రచారంలో ఉన్న తప్పుడు, అసంపూర్ణ, తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లి, వాస్తవాలను వివరించడంపై ‘RSS ఫ్రెండ్స్’ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఇందుకోసం సమాచార, విద్యా, ప్రజా సంబంధాలు, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనుంది.
జర్నలిస్టులు, పరిశోధకులతో ముఖాముఖి
ప్రజలు, జర్నలిస్టులు, మీడియా సంస్థలు, పరిశోధకులు, విద్యాసంస్థలు, కమ్యూనిటీ నాయకులు, పౌర సమాజ సంస్థలతో చర్చలు, సమావేశాలు నిర్వహించనుంది. RSS భావజాలం, సంస్థ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల గురించి సమగ్ర సమాచారాన్ని అందించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేయనుంది.
బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా ప్రముఖులు
రాజేంద్ర సోనారికర్, జయంత్ పంత్, దేవానంద గద్దం తదితరులు ‘RSS ఫ్రెండ్స్’ సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. FARA కింద రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో అమెరికాలో సంస్థ కార్యకలాపాలకు అధికారిక రూపం లభించింది.



