
జైపూర్ : రాజస్థాన్ పర్యటనలో భాగంగా ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ భిల్వారా చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రసంత్ మనోజ్ఞాచార్య శ్రీ పులక్ సాగర్ జీ మహరాజ్‌ను కలిశారు. ఈ సందర్భంగా మహారాజ్ మోహన్ భాగవత్ కి ఓం చిహ్నంతో పాటు ఓ పుస్తకాన్ని ఆశీర్వచన రూపంలో బహూకరించారు. ధర్మం, సంస్కృతి, గోసేవ, సామాజిక ఐక్యత మరియు సామరస్యం, అలాగే సామాజిక జీవనానికి సంబంధించిన వివిధ అంశాలపై వారు అర్థవంతమైన చర్చలు జరిపారు.
తర్వాత మోహన్ భాగవత్ మహారాజ్ కి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా సాగర్ జీ మహారాజ్… మోహన్ భాగవత్ కి ఆశీర్వచనాలు అందిస్తూ…జాతీయ సమైక్యత మరియు సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడంలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక పాత్ర పోషించాల్సి ఉందని నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా, ఆచార్య పులక్ సాగర్ జీ స్ఫూర్తిదాయక జీవనగాథ ఆధారంగా ఇండోర్‌కు చెందిన సరోజ్ షా రచించిన ‘ఏక్ ఔర్ ముక్తిదూత్’ (Ek Aur Muktidoot) అనే పుస్తకాన్ని డాక్టర్ మోహన్ భాగవత్ ఆవిష్కరించారు. అనంతరం ఆ పుస్తకాన్ని ఆచార్యశ్రీ పాదపద్మాలకు అంకితం చేశారు.





