News

“బయట తుమ్మండి వైరస్ వ్యాప్తి చెయ్యండి” ఇన్ఫోసిస్ ఉద్యోగి పైత్యం

2kviews

మూర్ఖత్వానికి చదువు, హోదాతో సంబంధం లేదని ఋజువు చేశాడో వ్యక్తి. ‘వైరస్ వ్యాప్తి చెందడానికి’ ప్రజలను ‘బయటకు వెళ్లి తుమ్మమని’ ప్రోత్సహిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసిన ఉద్యోగి సేవలను నిలిపివేసినట్లు భారత ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ నిన్న ప్రకటించింది.

ట్విట్టర్‌లో ఇన్ఫోసిస్ అధికారిక హ్యాండిల్ ఈ విషయంపై సంస్థ తన దర్యాప్తును పూర్తి చేసిందని, ఉద్యోగి చేసిన పోస్ట్ దాని ప్రవర్తనా నియమావళికి మరియు ‘బాధ్యతాయుతమైన సామాజిక భాగస్వామ్యానికి దాని నిబద్ధతకు’ వ్యతిరేకంగా ఉందని తెలిపింది.

ఫేస్బుక్ పోస్ట్లో, ఇన్ఫోసిస్ ఉద్యోగి ఇలా వ్రాశాడు, “చేతులు కలపండి, బయటికి వెళ్లి బహిరంగంగా నోటితో తుమ్మండి. వైరస్ వ్యాప్తి చేయండి.”

ఇన్ఫోసిస్ లో సీనియర్ టెక్నాలజీ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న ముజీబ్ మహ్మద్ నిర్వాకమిది. కోవిడ్ -19 కారణంగా నెలకొన్న భయాందోళనల మధ్య ఇతని ట్వీట్ సోషల్ మీడియాలోనూ అతని కార్యాలయంలోనూ అలజడిని సృష్టించింది.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ “ఇటువంటి చర్యల పట్ల కంపెనీకి జీరో-టాలరెన్స్ పాలసీ ఉంది. తదనుగుణంగా సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించాం” అని ప్రకటించింది.

“ప్రజలని బయటకు వెళ్లి తుమ్మి వైరస్ వ్యాప్తి చెయ్యమంటూ పోస్ట్ పెట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు ముజీబ్. అతను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు” అని బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జరుగుతోంది. ముజీబ్ సుమారు 25 సంవత్సరాల నుంచి బెంగళూరులో నివసిస్తున్నాడు.

Source : Swarajya

https://swarajyamag.com/insta/infosys-terminates-employee-who-wanted-to-spread-the-virus

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.