
ఉత్తరాఖండ్ : కృష్ణాష్టమి సందర్భంగా హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి రామ్ నగర్ లో లవ్ జిహాద్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన రాజు రావత్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో స్థానిక హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నెల 5 న అర్ధరాత్రి వేళ హిందూ కార్యకర్తలు రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసలు ఏ ఆధారంతో రావత్‌పై కేసు నమోదు చేశారని ప్రశ్నించారు. జన్‌మాష్టమి సందర్భంగా ఆయన ఈ చిత్ర పటాన్ని ఏర్పాటు చేశారని, స్థానిక యంత్రాంగం ఫిర్యాదు ఆధారంగా ఆదేశాలు ఇవ్వగానే దానిని తొలగించారని తెలిపారు.ఆదేశించిన 15 నిమిషాల్లోనే ఆయన టాబ్లోతో పాటు స్టాల్‌ను కూడా తొలగించారని, అంతగా సహకరించినప్పటికీ కేసు నమోదు చేయడం అర్థం కావడం లేదని నిరసనకారులు పేర్కొన్నారు.
“రాజు రావత్ జన్‌మాష్టమి రోజున టాబ్లోను ఏర్పాటు చేశారు. ఫిర్యాదు వచ్చాక దానిని తొలగించాలని యంత్రాంగం కోరగానే, ఆయన ఆ ఆదేశాలను గౌరవించి దాదాపు 15 నిమిషాల్లోనే దానిని తొలగించారు.ప్రదర్శనలోని ఏదైనా భాగం అభ్యంతరం కలిగించేలా ఉంటే, దానిని తొలగించాం కూడా. అయినా కేసులు ఎందుకు పెట్టారు? అని స్థానిక హిందువులు ప్రశ్నిస్తున్నారు.





