
5views
డెహ్రాడూన్ : ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న ఐదు మదర్సాలను ప్రభుత్వం సీల్ చేసింది. మైనారిటీ ఎడ్యుకేషన్ అథారిటీ, ఎడ్యుకేషన్ బోర్డు నుంచి ప్రాథమిక అనుమతులు కూడా మదర్సాలు పొందలేవని, అనుమతులు లేకుండానే నడిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మధ్య కాలంలోనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇలాంటి కోవలోని 20 మదర్సాలను మూసేసింది.
కొత్త గుర్తింపు విధానం ప్రకారం విద్యార్థులకు ఆధునిక విద్యను అందించడం తప్పనిసరి.అలాగే, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే మదర్సా బోర్డును రద్దు చేసింది.డెహ్రాడూన్ జిల్లాలోని మూడు మదర్సాలపై ఈ రోజు చర్యలు తీసుకున్నట్లు మైనారిటీ వ్యవహారాల శాఖ కార్యదర్శి డాక్టర్ పరాగ్ మధుకర్ ధకటే తెలిపారు.
ముఫ్తీ రయీస్ నిర్వహణలో ఉన్న మదర్సా జామియా-తుస్-సలామ్ అల్-ఇస్లామియా (ఆజాద్ కాలనీ, C-15, మసీదు సమీపంలో ఈ మూడు మసీదులు నడుస్తున్నాయి. మదర్సా దార్-ఎ-అర్ఖమ్ (ఆజాద్ కాలనీ, మజ్రా, డెహ్రాడూన్)మదర్సా దారుల్ ఉలూమ్ రహీమియా (మక్కా మసీదు సమీపంలో, డెహ్రాడూన్) నిర్వాహకులు, తమ మదర్సాలను మూసివేసినట్లు పేర్కొంటూ ఒక అంగీకార పత్రాన్ని సమర్పించారు కూడా.
ఉధమ్ సింగ్ నగర్‌లో ఎనిమిది, హరిద్వార్ జిల్లాలో నాలుగు, నైనిటాల్ జిల్లాలో నాలుగు మరియు డెహ్రాడూన్ జిల్లాలో ఒకటి చొప్పున ఇప్పటివరకు 17 మదర్సాలను సీల్ చేశామని, మరో మూడు మదర్సాలు తాము మూసివేసినట్లు లిఖితపూర్వక ధృవీకరణ పత్రాలను సమర్పించాయని డాక్టర్ పరాగ్ తెలిపారు. అంటే, ఇప్పటివరకు మొత్తం 20 అక్రమ మదర్సాలను ప్రభుత్వం మూసేసింది.
హల్ద్వానీ నగరంలో (నైనిటాల్ జిల్లా) నిర్వహిస్తున్న గుర్తింపు లేని మదర్సాలు-ప్రత్యేకంగా మదరసా జామియా నూరియా బర్కత్-ఎ-అమీనా (షానీ బజార్ రోడ్, గౌజాజలి ఉత్తర), రంజాన్ ఆర్గనైజేషన్ (సున్నీ బడి), ఇందిరా నగర్ బంభూల్‌పురా మసీదు వద్ద ఉన్న మదర్సాలు సీజ్ చేశారు.
హల్ద్వాని సిటీ మేజిస్ట్రేట్ ఎ.బి. వాజ్‌పేయి మాట్లాడుతూ, ఆ రెండు మదర్సాలనూ తమ గుర్తింపునకు సంబంధించిన అవసరమైన పత్రాలను సమర్పించాల్సిందిగా కోరామని, అయితే నిర్వాహకులు ఆ పత్రాలను సమర్పించడంలో విఫలం కావడంతో వాటి భవనాలను సీల్ చేశామని తెలిపారు.





