ArticlesNews

హల్దీఘాటి యుద్ధం – ఒక అంచనా

6views

 

 మొగలులకు వ్యతిరేకంగా జరిగిన విజయవంతమైన పోరాటం

ప్రాతఃస్మరణీయుడైన మహారాణా ప్రతాప్ భారతీయ స్వేచ్ఛకు ఒక దార్శనిక, తాత్విక ప్రతీక. స్వదేశం, స్వధర్మ రక్షణ కోసం పరిమిత వనరులున్నప్పటికీ, నాడు అత్యంత శక్తిశాలి అయిన మొగల్ సమ్రాట్‌తో అతడు తలపడ్డాడు. అతడు పరాధీనతకు బదులుగా స్వేచ్ఛను ఎంచుకున్నాడు. అతడు కావాలనుకుంటే పరాధీనతను స్వీకరించి, ఇతర రాజులలా వైభవోపేతంగా జీవితాన్ని జీవించవచ్చు. ఈ అవకాశం అతడికి ఉంది. నాలుగు సంధి ప్రతిపాదనలను తోసిపుచ్చి అతడు స్వాతంత్య్రాన్ని కాపాడుకునేందుకు సంఘర్షణ మార్గాన్ని ఎంచుకున్నాడు.

అక్బర్ సామ్రాజ్యవాద దురాశలో మేవాడ్ స్వాధీనత అన్నది అతి పెద్ద అడ్డంకి. దీనికి తోడు గుజరాత్ లేదా గుజరాత్ సముద్ర తీరం వరకు సజావుగా వాణిజ్య కార్యకలాపాలు జరగడానికి అతని సామ్రాజ్యంలో మేవాడ్ కలవడం అత్యవసరం. సామ,దాన, భేద దండోపాయాలను ఉపయోగించి ఎలాగైనా మేవాడ్‌ను స్వాధీనం చేసుకోవలన్నది అతడి కోరిక. అందుకే, 1572 నుంచి 1576 జూన్ వరకు, నాలుగు సంధి ప్రతిపాదనలను పంపాడు. కానీ, ప్రతాపుడు తనకు ప్రాణాలతో సమానమైన మేవాడ్‌ను అతడు అధీనం చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు.  దాని ఫలితమే 18 జూన్, 1576లో హల్దీఘాటి యుద్ధం.

హల్దీఘాటి యుద్ధం మహారాణా ప్రతాప్ విజయవంతమైన, కీర్తిదాయకమైన సంఘర్షణకు ప్రారంభం. ఈ యుద్ధం 7 సంవత్సరాలు జరిగింది. ఈ సంఘర్షణలో నిర్ణాయకమైన పరిష్కారం దివేర్ యుద్ధంలో లభించింది. హల్దీఘాటీ యుద్ధంలో ప్రతాపుడు తన శత్రువులపై పోరాటంచేశాడు. ఈ సంఘర్షణను కూడా ప్రతాపుడే ప్రారంభించాడు. దారుణమైన వేడి ఉండే ఎండాకాలం కోసం ఎదురుచూశాడు. మొగలులను లోయవరకు పిలిచాడు. ప్రతాపుడి ప్రచండమైన దాడి ఎంత భీకరంగా ఉందంటే, మొగల్ సేనల కాళ్లు కంపించాయి. శత్రు సైన్యం గందర గోళపడి, పట్టుకోల్పోయి ఆరుకోసల దూరం పారిపోయింది. ఆ తర్వాత భీషణ సంఘర్షణ ఖమణోర్‌లోని రక్త తలాsTÖ మైదానంలో జరిగింది. ఈ భీషణ సంఘర్షణలో ప్రతాపుడి అద్భుత పరాక్రమం సాక్షాత్కారమైంది. మొగల్ సేనాపతి మాన్‌సింగ్ తన ఏనుగు అంబారీలో దాక్కొని, ప్రాణాలు కాపాడుకున్నాడు. అక్కడ రోజంతా జరిగిన సంఘర్షణలో మొగల్ సేనలకు భారీగా నష్టం వాటిల్లింది. రాజపుత్రులలోని ఒక తరం అంతా ఇక్కడ  ఒకరకంగా తుడిచిపెట్టుకుపోయింది. గ్వాలియర్ రాజవంశానికి చెందిన మూడు తరాలు ఒకేసారి బలిదానం చేయగా, భిల్లులతో పాటు ప్రతివర్గం కూడా ప్రాణత్యాగం చేసింది. రోజంతా యుద్ధం సాగిన తర్వాత, ప్రతాపుడు సేనలు కోల్యారీ చేరుకున్నాయి. నేడు బాద్షాహీ బాగ్ అని పిలిచే ప్రాంతంలో మొగల్ సేనలు నిలిచాయి.

హల్దీఘాటీ వద్ద మొగల్ దండయాత్రను విశ్లేషిస్తే, అది వారి వైఫల్యాలకు ఒక స్మారక చిహ్నం. దీని మూల్యాంకనం చూద్దాం `

ప్రతాపుడి తల కోసం వచ్చి, ఒక ఏనుగును తీసుకువెళ్లారు

మొగలుల యుద్ధం దాని లక్ష్యంలో విఫలమైంది. సజీవంగా లేదా నిర్జీవంగా అయినా ప్రతాపుడిని బందీని చేయాలన్నది అక్బర్ కోరిక. కానీ, అతడు ప్రతాపుడిని అధీనంలోకి తెచ్చుకోవడంలో లేదా ఖైదు చేయడంలో విఫలమయ్యాడు. అయితే, రామప్రసాద్ అనే ఏనుగును బందీని చేయడంలో మాత్రం సఫలమయ్యారు. ఆ ఏనుగును ఫతేపూర్ సిక్రీకి తీసుకువెళ్లి అక్బర్‌కు సమర్పించగా, ఆయన దాని పేరును రామ్‌ప్రసాద్ నుండి పీర్ ప్రసాద్‌గా మార్చారు. అయితే, ఆ ఏనుగుకు ప్రతాపుడి పట్ల ఎంత స్వామి భక్తి ఉండేదంటే, అది అన్నపానాలను సైతం ముట్టకుండా ప్రాణత్యాగం చేసిందని చెప్తుంటారు.

స్వాతంత్య్ర సమరం వర్సెస్ మతయుద్ధం

ప్రతాపుడికి హల్దీఘాటీ యుద్ధం ఒక స్వాతంత్య్ర సమరం కానీ, మొగలులకు అది ఒక మత యుద్ధం. మొగలుల చరిత్రను రచించిన బదయÖనీ హల్దీఘాటీ యుద్ధ సమయంలో అక్కడ ఉన్నాడు. అతను తమ సేనాపతి ఆసఫ్ ఖాన్‌ను ఒకసారి ప్రశ్నించాడు, ఇరువైపులా ఉన్న రాజపుత్ర సైనికులు ఒకేరకమైన వేష భాషలను కలిగి ఉన్నారు, ఎవరిపై బాణం వేయాలో తెలియడం లేదు అన్నప్పుడు, నువ్వు బాణాలు వేస్తూ ఉండు, ఎవరు మరణించినా విజయం మతానిదే అవుతుందంటూ ఆసిఫ్ ఖాన్ ్పువాబిచ్చాడు.

హల్దీఘాటీ యుద్ధం తర్వాత మొగలు సేనల దుర్దశ

యుద్ధానంతరం మొగల్ సేనలు రహస్యంగా దాక్కొని దాక్కొని గోగుందా చేరుకున్నాయి. ప్రతాపుడికి ఎంత భయపడ్డారంటే, వారు తమ రక్షణ కోసం గోగుందా కోటకు నాలుగు దిక్కులా లోతైన కందకాలను తవ్వించి, తర్వాత ఎత్తైన గోడలు నిర్మింపచేశారు. సేనలు అందులో ఖైదీల్లాగా తమ జీవితాన్ని గడపడం ప్రారంభించారు. ముందుగా ఆ ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా లభించే మామిడి కాయలు తిన్నారు. దానితో వారికి విరోచనాలు పట్టుకున్నాయి. వీటి కారణంగానే, చాలామంది సైనికులు మరణించారు. మామిడికాయలు అయి పోయిన తర్వాత గుర్రాలను చంపితిన్నారు. కుళ్లిన మాంసం కూడా తిన్నారు. దీనితో సైనికులు కýరా బారిన పడ్డారు. దీనివల్ల కూడా చాలామంది సైనికులు మరణించారు. హల్దీఘాటీలో జరిగిన ప్రత్యక్ష యుద్ధంలో మరణించిన సైనికులకన్నా ఎక్కువమంది విరోచనాలు, కలరా కారణంగా మరణించారు.

వారు మొత్తానికి ప్రాణాలు కాపాడుకొని, సెప్టెంబర్ మాసానికి ఫతేపూర్ సిక్రీ వైపు ప్రయాణిస్తుండగా, బదయÖనీ ఏం రాశాడంటే, తాము ప్రతాప్‌ను ఓడించామని వీరు చెబుతుంటే, ఒక్క వ్యక్తి కూడా వారిని నమ్మలేదు!

మాన్‌సింగ్, ఆసిఫ్ ఖాన్‌ల బహిష్కరణ

సేనాపతి మాన్‌సింగ్, ఆసిఫ్ ఖాన్‌లు ఫతేపూర్ సిక్రీ చేరుకునే సమయానికి వారి వైఫల్యంపట్ల అక్బర్ ఎంత క్రోధుడై ఉన్నాడంటే,  6 నెలల పాటు దర్బార్‌లోకి వారి ప్రవేశాన్ని నిరోధించాడు.

మేవాడ్‌పై అక్బర్ స్వయంగా దండయాత్రకు రావడం

హల్దీఘాటీ యుద్ధ వైఫల్యానికి మరో ప్రమాణం ఏమిటంటే, స్వయంగా అక్బరే 1576 అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రతాపుడికి విరుద్ధంగా  దండయాత్రకు రావలసి రావడం.

యుద్ధం తర్వాత కూడా ప్రతాపాడి పాలన

హల్దీఘాటీ యుద్ధం తర్వాత సంపూర్ణ మేవాడ్‌లో పాలన ప్రతాపుడిదే ఉం డేది. హల్దీఘాటీ యుద్ధం తర్వాత భూమి పట్టాలు, అనుమతులు, రాగి పలకలూ అన్నీ కూడా ప్రతాపుడి పేరుతోనే జారీ అవుతూ వచ్చాయి.

శాసనాలపై ప్రతాపుడి విజయ వర్ణన

ఖరసాన్ మందిరం, జగదీష్ మందిర్‌లలో ఉన్న శాసనాలలో హల్దీఘాటీ యుద్ధంలో ప్రతాపుడే విజేత అని పేర్కొన్నాయి.

హల్దీఘాటీ యుద్ధం మొగలులకు వ్యతిరేకంగా మహారాణా ప్రతాప్ చేసిన విజయవంతమైన సంఘర్షణ. ఆయన ఆ తర్వాత మొగలులపై చిన్న, పెద్ద కలిపి 40 యుద్ధాలలో పోరాడు. అందులో గోగుందా, మోహీ, కుంభల్‌గఢ్, డూంగర్‌పుర్ యుద్ధాలు ప్రస్తావించదగినవి. అంతిమంగా దివేరా యుద్ధంలో విజేతగా నిలిచాడు.

– నారాయణ ఉపాధ్యాయ, మహారాణా విజయ స్మారక సంస్థాన్, దివేర్ వ్యవస్థాపకులు