
హల్దీఘాటి యుద్ధానికి 450 ఏళ్లు
ఉజ్బెకిస్తాన్‌కు చెందిన బాబర్ వంశజుడైన అక్బర్ దేశంలోని అనేక హిందూ రాజులపై విజయాన్ని సాధించి, తన అధికారాన్ని ప్రతిష్టించిన తర్వాత, మేవాడ్ రాజ్యంపై అతడి కళ్లు పడ్డాయి. అందుకే, 18 జూన్, 1576న మానసింగ్ నేతృత్వంలో అక్బర్ తన సామ్రాజ్యవాద సేనలను రాణా ప్రతాప్‌పైకి పంపాడు. వారు హల్దీఘాటీపై దాడి చేసి, ఘోర పర్పుాయాన్ని పొందారు.
ఘోరంగా ఓడిన అక్బర్ సేనలు
యుద్ధానంతరం అక్బర్ సేనలు గోగుందా కోటలో ఆశ్రయం తీసుకోవలసి వచ్చింది. సామ్రాజ్య వాద సేనలు ఎంతగా భయపడిపోయాయంటే, ఆకలి తీర్చుకోవడానికి గుర్రాన్ని నడిపే సైనికుడు మరణించ డంతో, నడిపేవారు లేక ఉన్న గుర్రాలను తిన్నారుట. అక్బర్‌ను వెన్నంటి ఉండే ఈ సేనలకు, గోగుందా కోట నుంచి బయటకు వెళ్లి తమ అన్నపానాలకు ఏర్పాటు చేసుకునే సాహసం కూడా లేకపోయింది. తమపై ప్రతాపుడు గెరిల్లా దాడి చేస్తాడేమోనన్న అనుమానంతో కోటకు నాలుగు వైపులా కందకాలు తవ్వారు. భయం కారణంగానే యుద్ధమైన తర్వాత ఆ సేనలు నాలుగు మాసాల పాటు ఆ కోటలో బందీలుగా ఉన్నారు. హల్దీఘాటీ యుద్ధ పరాజయం అక్బర్‌ను తీవ్ర ఆగ్రహానికి లోనుచేసింది. అందుకే, తన ప్రధాన సేనాధ్యక్షుడైన మాన్‌సింగ్, అతడి సహచరుడు ఆసఫ్ ఖాన్‌లను బందీలను చేసి, ఆరు నెలల పాటు దర్బారుకు రావడానికి వీలులేకుండా ఖైదు చేశాడు.
తొలి నుంచి చివరి వరకూ భయంతో వణికిన మొగల్ సేనలు
హల్దీఘాటీ యుద్ధం మొదటి నుంచీ చివరి వరకూ మొగల్ సేనలు భయం నీడలో జీవించాయి. రాణాప్రతాప్ సేనల కంటే నాలుగు రెట్లు ఎక్కువున్నప్పటికీ, మొగల్ సేనలు వారి ముందు నిలవలేక భయపడి పారిపోయాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే ముందు వరుసలోని సేనలకు నాయకత్వం వహించిన సేనాపతి హకీం ఖాన్ సూరీ మొగల్ సేనలపై విరుచుకుపడి, వెంటాడటంతో వారు మొగల్‌రాజ్య శివార్లకు, టెరక్రోటకు ప్రసిద్ధమైన మోలేలా గ్రామం వరకూ పారిపోయారు.
అప్పుడు మొగల్ సైన్యం వెనుదిరగకుండా ఆపడానికి, సైన్యం చివరన ఉన్న సేనాపతి మహత్తర్ ఖాన్, మొఘల్ చక్రవర్తి అక్బర్ స్వయంగా ఒక భారీ సైన్యంతో యుద్ధభూమికి వచ్చాడనే పుకారును వ్యాపింపజేశాడు. అప్పుడు పారిపోతున్న మొగల్ సేనలకు కొంత ధైర్యం తిరిగి వచ్చి, పరుగులు ఆపారు. కేవలం మాన్‌సింగ్ మాత్రమే కాదు, ఆ సేనలలో అక్బర్‌కు చెందిన అనేక మంది సేనాపతులు ఉన్నారు. ఎందుకంటే, అక్బర్‌కు మాన్‌సింగ్ మీద పూర్తి విశ్వాసం కూడా లేదు.
అక్బర్ సేనాపతి మాన్‌సింగ్‌కు అవమానం
యుద్ధం మధ్యలో దృశ్యం ఎలా తయారైందంటే, అనేకమంది సేనా నాయకులు కలిగిన ఆ విశాలమైన మొగల్ సేనల మధ్యలోకి రాణాప్రతాప్ తన గుర్రమైన చేతక్‌పై ఒంటరిగా ప్రవేశించాడు. అప్పుడు చేతక్ ఆ సేనలకు నేతృత్వం వహిస్తున్న మాన్‌సింగ్ కూర్చున్న ఏనుగు కుంభస్థలంపై తన పాదాలను విసిరింది.
అదే సమయంలో రాణా ప్రతాప్ ఈటెలతో మాన్‌సింగ్‌పై తీవ్ర దాడి చేశాడు. ఆ ఈటెల దాడి నుంచి తప్పించుకునేందుకు ఏనుగుపై కూర్చున్న మాన్‌సింగ్ మావటివాడి వెనుక దాక్కున్నాడు. తన దాడిలో మావటివాడితో పాటు మాన్‌సింగ్ కూడా మరణించాడనుకున్న రాణా ప్రతాపుడు తన లక్ష్యం పూర్తి అయిందనుకుని గాయపడిన చేతక్‌ను తీసుకుని యుద్ధభూమి నుంచి బయటకు వచ్చాడు. ఈ యుద్ధంలో ప్రతాపుడు అక్బర్ సేనాపతుల్లో ఒకడైన బహలోల్ ఖాన్‌ను అతడి గుర్రంతో సహా రెండుగా చీల్చేశాడు. యుద్ధమైన తర్వాత మాన్‌సింగ్ తిరిగి అక్బర్ వద్ద వెడుతుండగా, మార్గంలో ప్రజలు అతడిని ఓడిపోయిన ఒక సేనాపతిని చూసినట్టే చూశారు.
సేనల ఓటమి, దీవేర్‌లో అక్బర్ సంపూర్ణ పరాజయం
హల్దీఘాటీ యుద్ధంలో మొగలుల వైఫల్యం పట్ల అక్బర్ ఆందోళన చెంది, 1582వరకు సేనాపతులను మార్చి మార్చి మేవాడ్‌పై అనేక విఫల దాడులు చేశాడు. లక్షమంది సైన్యంతో వచ్చి, స్వయంగా అక్కడ ఉన్నాడు. హల్దీఘాటీ యుద్ధం తర్వాత ఉదయపూర్ పేరును ముహమ్మదాబాద్‌గా మార్చేందుకు అక్టోబర్ 1576లో విఫలయత్నాలలో భాగంగా ఆ పేరుతో వెండి, బంగారు నాణేలను ముద్రించి జారీచేశాడు. అంతిమంగా, 1583లో దీవేర్ యుద్ధానంతరం మొగల్ సేనలు ఘోరంగా ఓడి పారిపోయాయి. ఈ యుద్ధంలోనే మొగల్ సేనాపతి చుట్టూ ఈటెలు, బల్లేలు వేసి అమర్‌సింగ్ బంధించాడు. దీవేర్ యుద్ధానంతరం 36 మొగల్ థాణాల నుంచి మొగల్ సేనలను తరిమికొట్టారు. దివేర్‌లో పరాజయానంతరం ప్రతాపుడు జీవించి ఉండగా, మేవాడ్‌ను ఆక్రమించే సాహసం ఎప్పుడూ చేయలేదు.





