
నిత్యం భారత్ పై ఇస్లామిక్ ఉగ్రవాదులను రెచ్చగొట్టే పాకిస్తాన్ కి ఓ కాంగ్రెస్ నేత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. కేరళంలోని పతనంతిట్ట ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత రెజి పూవత్తూర్.. పాక్ స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్టు 14 న శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా సోదర దేశమంటూ పాక్ ను సంబోధించడంతో జాతీయవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు.
“సోదర దేశానికి హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు” అని ఆ పోస్ట్‌లో రాసి ఉంది. అందులో పాకిస్తాన్ జాతీయ జెండా చిత్రంతో పాటు, ఆ దేశ సమృద్ధి మరియు ఐక్యతను ఆకాంక్షిస్తూ వ్యాఖ్యలు చేశారు.‘కాంగ్రెస్ పతనంతిట్ట’ ఫేస్‌బుక్ గ్రూప్‌లో పాకిస్తాన్‌ను ప్రశంసిస్తూ పూవత్తూర్ ఒక కథనాన్ని కూడా షేర్ చేసినట్లు సమాచారం. ఆ పోస్ట్ కూడా వివాదాస్పదమవ్వడంతో దానిని డిలీట్ చేశారు.
ఇప్పటికే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పూర్తి వందేమాతరం ఆలాపించలేదన్న విమర్శలుగా జోరుగా వున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలో వున్న కేరళంలో అయితే.. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజున పూర్తి వందేమాతరాన్ని ఆలాపించలేదు. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ కి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు.





