News

బహుపరాక్…. కీర్తనల రూపంలో ప్రార్థనలు.. సాఫ్ట్ కన్వర్షన్స్ దిశగా క్రైస్తవులు

6views

మహారాష్ట్రలో కొత్తగా మతస్వేచ్ఛ చట్టం 2026 అమలులోకి వచ్చింది. దీంతో క్రైస్తవ మిషనరీలు రకరకాల కొత్త కొత్త ఫీట్లు చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ‘‘సాఫ్ట్ కన్వర్షన్’’ కి తెరలేపుతున్నారు. దీనిపై హిందువులు అత్యంత జాగరూకతతో వుండాలి.క్రైస్తవ మిషనరీలు సంప్రదాయ హిందూ కీర్తనల రూపంలో ప్రార్థనా కార్యక్రమానికి తెర లేపారు. పూణెలోని గురువార్ పేట్ లో వున్న ‘పవిత్ర నామ్ దేవాలయంలో అచ్చు ఇలాంటి ఘటనే జరిగింది. దీంతో క్రైస్తవ బిషప్ పై పంకజ్ దేవ్ నూర్, క్రైస్తవ నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి.

ఎఫ్‌ఐఆర్ మరియు ఫిర్యాదుదారుడి కథనం ప్రకారం.. దేవ్ నూర్ ఏసుక్రీస్తు భక్తిని ప్రచారం చేయడానికి కీర్తన, అభంగ్, పోవాడా, భారూడ్, తాళం, వీణ, సితార్, తబలా మరియు గొంధల్ వంటి హిందూ భక్తి సంప్రదాయాలను ఉపయోగించారు. యేసును పూజిస్తే రోగాలు నయమవుతాయని, వర్షాలు కురుస్తాయని మరియు ప్రజలు యేసు మార్గంలో జీవించాలని ప్రలోభాలకు గురి చేస్తున్నారని హిందువులను ఆకర్షించి క్రైస్తవ మతంలోకి మార్చడానికే ఈ ప్రదర్శన నిర్వహించారని ఫిర్యాదుదారు ఆరోపించారు.వక్త విదేశీయుడని తెలిసినప్పటికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, క్రైస్తవ బోధనలను ప్రచారం చేయడానికి హిందూ మత రూపాలను ఉపయోగించడం “సాఫ్ట్ కన్వర్షన్” (పరోక్ష మతమార్పిడి) కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మహారాష్ట్ర మత స్వేచ్ఛ చట్టం, 2026 అమలులోకి వచ్చిన కొద్దిరోజులకే ఈ కేసు నమోదు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చట్టం బలాత్కారం, మోసం, తప్పుడు ప్రచారం, ఒత్తిడి లేదా లోభచూపడం ద్వారా జరిపే అక్రమ మతమార్పిడులను నిషేధిస్తుంది. ఈ బిల్లుకు జూలైలో రాష్ట్రపతి ఆమోదం లభించగా, అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలులోకి తెచ్చింది.