News

ఖలిస్తానీ నిజ్జర్ హత్య భారత్ పాత్ర లేదు.. కెనడా సంచలన వ్యాఖ్యలు..

7views

ఖలిస్తానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారత్ మధ్య దౌత్యవివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. 2023లో సర్రే ప్రాంతంలో ఇతను హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని అప్పటి ప్రధాని జస్టిన్ టూడో సంచలన ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య దౌత్య వివాదం మొదలైంది. కెనడా ఆరోపణలకు అంతే ధీటుగా భారత్ స్పందిస్తూ.. ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లకు కెనడా ప్రధాన స్థావరంగా మారిందని విమర్శించింది.

ఈ నేపథ్యంలో, ఈ హత్యపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వ అధికారుల ప్రమేయాన్ని నిర్ధారించే ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. డిప్యూటీ కమిషనర్ లిసా మోర్లాండ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో భారత ప్రభుత్వ అధికారులను ఈ కేసుతో అనుసంధానించే ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అయితే భారత ప్రభుత్వం కూడా ఈ విచారణకు సహకరిస్తోందని వెల్లడించారు.