
ప్రముఖ టిబెటన్ బౌద్ధ నేత తుల్కు హుంగ్ కర్ దోర్జే స్థాపించిన ‘హుంగ్‌కర్ దోర్జే వొకేషనల్ హై స్కూల్’ను చైనా సర్కార్ బలవంతంగా మూసేయించింది. ప్రముఖ టిబెటన్ బౌద్ధ నాయకుడు తుల్కు హుంగ్‌కర్ దోర్జే స్థాపించిన ఈ పాఠశాల ఎంతో పేరు పొందింది; కాగా, ఆయన 2025 మార్చిలో వియత్నాంలో చైనా అదుపులో ఉన్నప్పుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు.
ప్రస్తుత క్వింగ్‌హై ప్రావిన్స్ పరిధిలోని గోలోగ్ (గులో) టిబెటన్ అటానమస్ ప్రిఫెక్చర్‌లో ఉన్న ఈ పాఠశాల, స్నోల్యాండ్ ప్రాచీన మరియు ఆధునిక విద్యా కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది, 2008లో స్థాపించబడినప్పటి నుండి సాంప్రదాయ టిబెటన్ సంస్కృతి మరియు భాషలో ప్రత్యేక విద్యను అందిస్తోంది.
ఆ పాఠశాలను మూసివేయడానికి ప్రధాన కారణం టిబెటన్ భాషను బోధనా మాధ్యమంగా ఉపయోగించడమేనని పలువురు అంటున్నారు. టిబెటన్ ప్రాంతాలలో కూడా మాండరిన్ భాషనే ఏకైక బోధనా మాధ్యమంగా ఉండాలని నిరంకుశ చైనా సర్కార్ నిర్దేశించింది. నిజానికి ఈ పాఠశాల స్థాపించినప్పటి నుంచి హుంగ్‌కర్ దోర్జే టిబెటన్ సంస్కృతిని కాపాడేందుకు విశేషంగా కృషి చేశారు. కానీ.. చైనా ప్రభుత్వానికి రుచించక, అష్టకష్టాలూ పెట్టింది.





