News

దేవాలయంపై దుస్తులు ఆరేసిన ముస్లింలు.. హిందువుల తీవ్ర నిరసనలు

36views
హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్‌లో ఉన్న అక్బర్ బాగ్ ప్రాంతంలో ఘోరం జరిగింది. ఓ ముస్లిం కుటుంబం హిందూ దేవాలయంపై దుస్తులు ఆరేశారు. దీనిపై హిందూ కుటుంబాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. హిందువులు ప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యంతరం వ్యక్తం చేస్తే, ముస్లిం యువకులు మాత్రం ఏకంగా హిందువులపై దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని, నిరసన వ్యక్తం చేశాయి.
అక్బర్ బాగ్‌లో హిందువుల కుటుంబపై దాడి జరగడాన్ని స్థానిక హిందువులు ఖండించారు. పవిత్రమైన దేవాలయంపై దుస్తులను పదే పదే ఆరేస్తున్నారని, దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. అలాగే దేవుడి పట్ల అది అగౌరవ సూచకం అని కూడా హిందువులు పేర్కొంటున్నారు.
దేవాలయంపై ఆరేసిన దుస్తులను తీసేయాలని హిందూ కుటుంబం మర్యాదపూర్వకంగానే అభ్యర్థించిందని, కానీ.. ఛాందసులు అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. అలాగే బెదిరింపులకు కూడా దిగుతున్నారని, మహిళలని కనీస గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు శాఖ వైఫల్యంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకున్నా.. ఎంఐఎం ఎమ్మెల్యే ప్రభావంతో వారిని విడుదల చేశారని, ఇది సిగ్గుచేటని మండిపడుతున్నారు.ఇటువంటి చర్యలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసి, చట్టవిరుద్ధ ప్రవర్తనకు ప్రోత్సాహం ఇస్తాయన్నారు.