
కరోనా వైరస్ నగరంలోని యువకుడికి సోకిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అధికారులు ఇతర ప్రాంతాలకు, వ్యక్తులకు ఈ వైరస్ సోకకుండా ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా వైరస్ సోకిన యువకుడు నివాసముండే చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం నగరంలోని రంగనాయకులపేటలో జరగాల్సిన శ్రీరంగనాథస్వామి రథోత్సవాన్ని జిల్లా కలెక్టర్ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో రథోత్సవ కార్యక్రమం పాక్షికంగా కొద్దిదూరం మాత్రమే కొనసాగింది. వేలసంఖ్యలో భక్తులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో కరోనా వ్యాప్తి కూడా అదేస్థాయిలో ఉంటుందని భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అయితే అధికారుల ఈ నిర్ణయాన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూ సాంప్రదాయాలను దెబ్బతీయ్యాలన్న ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. నిజంగా కరోనా వ్యాప్తిని అరికట్టాలనుకున్న వారైతే వందలమంది గుమికూడే సినిమాహాళ్ళను ఎందుకు మూయలేదని ప్రశ్నిస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రముఖ కొండ బిట్రగుంట దేవస్థానంలో రథాన్ని తగులబెట్టిన దుండగులను పట్టుకోడం మానేసి అదేదో పిచ్చివాళ్ళ పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న అధికార వర్గాలు హిందుత్వాన్ని నాశనం చెయ్యడానికి ఎంత నీచానికైనా ఒడిగడతాయని వారు పేర్కొంటున్నాయి. అధికార వర్గాలన్నీ మైనారిటీ పక్షపాత, హిందూ వ్యతిరేక వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయని పలు హిందూ సంస్థల వారు ఆరోపిస్తున్నారు.





