
215views
నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకురు గ్రామములో కంటి వైద్య శిబిరం జరిగినది. ఈ శిబిరంలో సుమారు 120 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 40 మందికి కేటరాక్ట్ ఆపరేషన్ అవసరమని నిర్ధారించారు. మిగిలిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆపరేషన్ అవసరమైన వారికి జయభారత్ హాస్పిటల్లో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కేటరాక్ట్ ఆపరేషన్లు చేస్తారు. ఈ వైద్య శిబిరంలో జయభారత్ హాస్పిటల్ కి చెందిన కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీలక్ష్మి వైద్య సేవలు అందించారు.