ArticlesNews

‘లవ్ జిహాద్’ వెనుక దాగున్న అసలు నిజాలు ఇవే!

28views

నేటి సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తున్న విషయాలలో ‘లవ్ జిహాద్’ ఒకటి. అయితే, దీనిని వ్యతిరేకించే లేదా తప్పుగా అర్థం చేసుకునే చాలా మందికి ఈ పదం వెనుక ఉన్న అసలు అర్థం , దాని పనితీరు తెలిట్లేదు అనేది నిజం. లవ్ జిహాద్ అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సాధారణ ప్రేమ వివాహం కాదు; ఇది ఒక ముస్లిం వ్యక్తి తన మత గుర్తింపును ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, ముస్లిమేతర అమ్మాయిని ప్రేమ వలలోకి దించే ఒక మోసపూరిత ప్రక్రియ.

గుర్తింపును దాచడం అనేది మోసం
లవ్ జిహాద్‌లో అన్నిటికన్నా కీలకమైన అంశం ఏమిటంటే—ముస్లిం వ్యక్తి తాను లక్ష్యంగా చేసుకున్న సమాజానికి చెందిన వాడిగా నటిస్తాడు. తన అసలు పేరును మార్చుకుని, హిందూ సంప్రదాయాలను పాటిస్తూ (ఉదాహరణకు: జంధ్యం ధరించడం, దేవాలయాలకు వెళ్లడం, సోమవారం ఉపవాసాలు ఉండటం వంటివి) పూర్తి హిందూ గుర్తింపును నటిస్తాడు. ప్రతి అడుగులోనూ అండగా ఉంటానని నమ్మిస్తాడు.

ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే—ఆ అమ్మాయి ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమించదు; ఆమె ఒక హిందూ వ్యక్తి అని నమ్మి, అతడితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత మోసం ద్వారా లేదా శారీరక సంబంధంలోకి దించిన తర్వాత మాత్రమే ఆమెకు అసలు నిజం తెలుస్తుంది. ఆపై ఆమెపై ఇస్లాంలోకి మారమని ఒత్తిడి మొదలవుతుంది.

అందుకు ఉదాహరణలతో నిరూపితమైన నిజాలు
ఈ విధమైన వ్యూహాత్మక మోసాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి అవేంటో మనం ఇప్పుడు చూద్దాం:

తారా షాదేవ్ ఉదంతం: ప్రసిద్ధ క్రీడాకారిణి తారా షాదేవ్‌ను రకీబుల్ ఖాన్ అనే వ్యక్తి ‘రంజీత్’ అనే పేరుతో పద్ధతి ప్రకారం వలలో వేసుకున్నాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజు వరకు కూడా ఆమెకు అతని అసలు గుర్తింపు తెలియదు.

హరిద్వార్ కేసు: ఇక మరో కేసులో అజహర్ అహ్మద్ అనే వ్యక్తి ‘రాహుల్’గా నటిస్తూ ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతని నిజస్వరూపం తెలియగానే ఆమె అతడిని వదిలివేసింది.
వడోదర కేసు: ఇక్బాల్ పర్మార్ అనే వ్యక్తి ‘ప్రతీక్ పటేల్’గా నటిస్తూ ఒక అమ్మాయిని మోసగించాడు.
వారణాసి కేసు: షరఫ్ రిజ్వీ అనే వ్యక్తి వేర్వేరు పేర్లు మరియు నకిలీ గుర్తింపులతో వివిధ రాష్ట్రాలలో ఏకంగా 12 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకుని, ఆపై మతం మారాలని వేధించాడు.
ఈ కేసులన్నీ స్పష్టం చేస్తున్నది ఒకటే: ఇక్కడ ప్రేమ ఆమోదయోగ్యంగా కనిపించినా, దాని పునాది మాత్రం పూర్తిగా మోసంపైనే ఆధారపడి ఉంది.

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఇంటర్వ్యూలో నివేదిత మీనన్ మరియు అర్ఫా ఖానుమ్ షేర్వానీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. వారి వాదన ప్రకారం—ముస్లిం పురుషులు చాలా ఆకర్షణీయంగా ఉంటారని, అందుకే హిందూ అమ్మాయిలు వారి కోసం పిచ్చిగా పడిచస్తారంటూ వ్యాఖ్యానించారు. హిందూ పురుషులను ఆకర్షణీయం కానివారిగా చిత్రీకరిస్తూ, హిందూ మహిళలకు మతం, నైతికత, విలువలు ఏమీ ఉండవనే విధంగా మాట్లాడారు.

అయితే, ఈ వ్యాఖ్యలు లవ్ జిహాద్ యొక్క అసలు వాస్తవాన్ని పక్కదారి పట్టించేవిగా ఉన్నాయి. ఎందుకంటే, లవ్ జిహాద్ కేసులలో హిందూ అమ్మాయిలు ముస్లిం వ్యక్తి గుర్తింపుతో ఆకర్షితులు కాలేదు; సదరు ముస్లిం వ్యక్తి ధరించిన ‘హిందూ ముసుగు’ (నకిలీ హిందూ గుర్తింపు) కారణంగానే ఆకర్షితులయ్యారు. ఒక వ్యక్తి ముస్లిం అని తెలిసి కూడా ప్రేమించే అమ్మాయిల విషయంలో ‘లవ్ జిహాద్’ అనే పదాన్ని ఉపయోగించరు. ఈ వీడియో ద్వారా అర్ఫా ఖానుమ్ వంటి వారి మనస్తత్వం మరియు హిందూ స్త్రీపురుషుల పట్ల వారికి ఉన్న ద్వేషం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శకులు పేర్కొంటున్నారు.

సెలబ్రిటీ స్త్రీల విషయంలో కూడా మతమార్పిడిల ఒత్తిళ్లు

కేవలం సాధారణ మహిళలే కాదు, సెలబ్రిటీలు సైతం ఇలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి.

చాహత్ ఖన్నా కేసు: 2018లో నటి చాహత్ ఖన్నా తన భర్త ఫర్హాన్ మీర్జాతో విడాకులు తీసుకున్న సమయంలో సంచలన ఆరోపణలు చేసింది. తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా బలవంతం చేశాడని, ఇస్లాంలోకి మారాలని తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, ఆమె మెదడును కడిగే ప్రయత్నం చేశాడని పేర్కొంది. అయితే, ఆమె మతం మారడానికి నిరాకరించి, అతడిని విడిచిపెట్టి తిరిగి హిందూ మతంలోకి వచ్చింది.

అనితా హసనందాని ప్రకటన: మరో నటి అనితా హసనందాని కూడా తన గత ప్రియుడు ఎజాజ్ ఖాన్ తనను మతం మార్చాలని కోరుకున్నాడని, ప్రేమతో తాను మతం మారడానికి సిద్ధపడినప్పటికీ, మతం మార్చాలని కోరడం అసలైన ప్రేమ కాదని గ్రహించి, వారు విడిపోయినట్లు పేర్కొంది.

ప్రేమ అనేది పరస్పర నమ్మకం, నిజాయితీపై ఆధారపడి ఉండాలి. కానీ, లవ్ జిహాద్ విషయంలో మాత్రం ప్రేమ పేరిట గుర్తింపును దాచడం, వంచించడం, ఆపై బలవంతపు మతమార్పిడులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. ఒక వ్యక్తి యొక్క అసలు గుర్తింపును దాచిపెట్టి చేసే ఏ సంబంధమైనా మోసమే అవుతుంది. ఈ సూక్ష్మమైన వ్యత్యాసాన్ని మరియు దీని వెనుక ఉన్న వ్యూహాన్ని సమాజం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.