భక్తి భావనలతో మహాకవి క్షేత్రయ్య వాడిన పదాలు దైవలీలలను చాటాయని, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, భారతీయ తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షుడు నారాయణస్వామి, ఎం.వి.కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేట్ భవనంలో సాహితీవేత్త డాక్టర్ మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో మహాకవి క్షేత్రయ్య సాహితీ వైభవంలో భాగంగా గీతాలాపన, కవితార్చన నిర్వహించారు. వారు మాట్లాడుతూ క్షేత్రయ్య సిద్ధేంద్రయోగి సూచనలతో అనేక క్షేత్రాలు దర్శించి ఆయా దేవతలపై అనేక గీతాలు రచించారని తెలిపారు. తద్వారా మహాకవి క్షేత్ర య్య బిరుదుతో ప్రఖ్యాతి పొందారని పేర్కొన్నారు. రచయితల జిల్లా అధ్యక్షుడు తోట గోవిందన్ మాట్లాడుతూ క్షేత్రయ్య కంచి, చిదంబరం క్షేత్రాల్లో కవిగానే కాకుండా పరమ భక్త శిఖామణిగా కీర్తి పొందారని తెలిపారు. తెలుగు రాజులు పరిపాలించిన తంజావూరు, మధుర రాజ్యాల మధ్య సఖ్యతకు క్షేత్రయ్య ప్రయత్నించారని తెలిపారు.
133views
You Might Also Like
నక్సల్ రహిత జిల్లాగా పశ్చిమ సింగ్ భూమ్
27
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా, ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా వుండేది.నక్సల్స్ ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను జరగనిచ్చేవారు కాదు. దీంతో ఆ ప్రాంతం అభివృద్ధికి దూరంగా...
తిరుమలలో వైభవంగా శ్రీ కశ్యప మహర్షి జయంతి వేడుకలు
36
తిరుమల: శ్రావణమాస హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ కశ్యప మహర్షి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఆస్థాన మండపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని టీటీడీ...
భారత సైన్యంలో చేరుతాం.. నేపాల్‌లో రోడ్డెక్కిన గోర్ఖా యువత
83
పోఖరా: భారత సైన్యంలో గోర్ఖా సైనికులుగా చేరాలన్న ఆశతో ఉన్న నేపాల్ యువత, మాజీ గోర్ఖా సైనికులు రోడ్డెక్కారు. భారత సైన్యంలో నేపాల్ యువత నియామకాలను అగ్నిపథ్...
బెంగళూరులో ఉగ్రవాద సంబంధాలపై ఓ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
19
బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసాఫుల్ మాలిక్ అనే యువకుడిని పోలీసులు...
షేక్ సాధిక్ ఖాన్ వేధింపుల కారణంగా గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం
36
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని రోడ్డు కమ్ రైలు వంతెనపై నుంచి పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి...
బలూచిస్థాన్‌లో పాక్ స్వాతంత్య్ర దినోత్సవానికి నిరసన.. వెలవెలబోయిన వేడుకలు
45
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14న బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వేడుకలను బహిష్కరిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంద్...





