News

పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న గోసంరక్షణ సమితి సభ్యులు..

24views

బాపట్ల జిల్లా చీరాల జాతీయ రహదారిపై అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు వాహనాలను గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. బాపట్ల వైపు నుంచి ఒంగోలు వైపు తరలిస్తున్న ఆవులు, ఎద్దులు, దున్నపోతులను రక్షించి పోలీసులకు అప్పగించారు. బాపట్ల మండలం కర్లపాలెం సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఈ వాహనాలను స్థానికులు గుర్తించారు. వెంటనే చీరాలకు చెందిన గోసంరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సమితి సభ్యులు.. చీరాల ఎన్‌హెచ్‌ 216ఏ జాతీయ రహదారిపై కాపు కాశారు.

ఈ ప్రాంతంలో మిగిలిన రెండు వాహనాలను నిలిపివేశారు. ఒక వాహనంలో ఉన్న గణేష్, రమేష్‌ అనే వ్యక్తులను సమితి సభ్యులు ప్రశ్నించగా.. వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో పశువుల రవాణా అక్రమంగా సాగుతోందని నిర్ధారించుకుని, పోలీసులకు సమాచారం అందించారు. మూడు వాహనాల్లో కలిపి మొత్తం 23 ఎద్దులతో పాటు మరికొన్ని ఆవులు, దున్నలను తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.