News

భావనారాయణస్వామి గుడి బావిలో బయటపడిన విగ్రహాలు

7views

పల్నాడు జిల్లా ఇనుమెళ్లలోని పురాతన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా అరుదైన ఏడు లోహపు విగ్రహాలు, మూడు రాగి రేకులు బయటపడ్డాయి. పనులు చేస్తుండగా ఆలయం లోపల మందపాటి రాళ్లతో మూసి ఉన్న ఓ రహస్య బావిని స్థానికులు, కార్మికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఆ బావిపై ఉన్న రాళ్లను తొలగించి చూడగా లోపల ఈ విగ్రహాలు లభ్యమయ్యాయి. ఇవి విలువైన పంచలోహ విగ్రహాలు కావచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పూర్వకాలంలో దొంగల బారి నుంచి దేవుని ప్రతిమలను కాపాడుకునేందుకు వీటిని ఇలా బావిలో దాచిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆలయానికి చేరుకుని బయటపడిన విగ్రహాలను పరిశీలించారు.