
ప్రపంచ ప్రగతికి జ్ఞానం చోదకశక్తిగా ఉన్న ఈ తరుణంలో, భారతదేశపు అపారమైన మేధో వారసత్వం సంస్కృత గ్రంథాలలోనే నిక్షిప్తమై ఉంది. తత్వశాస్త్రం నుండి విజ్ఞాన శాస్త్రం వరకు, ఈ నాగరిక జ్ఞానం గతాన్ని తీర్చిదిద్దిన అంతర్దృష్టులను కలిగి ఉండి, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూనే ఉంది.
మనం జ్ఞానమనే విశాల భాండాగారాన్ని శోధించాలనుకున్నప్పుడు, మన సొంత భాషల వైపు చూడం. జ్ఞానాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరూ పశ్చిమ దేశాల వైపే చూస్తారు. అక్కడ ఇప్పటికే అపారమైన జ్ఞానం ఉత్పత్తి అయ్యింది. ప్రతిరోజూ మరింత ఉత్పత్తి అవుతూనే ఉంది. మనం జ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటాము. విజ్ఞాన శాస్త్ర రూపంలో గానీ లేదా ఆచరణాత్మక సాంకేతిక రూపంలో గానీ ఈ భారతీయ జ్ఞాన సంప్రదాయానికి తరచుగా దోహద పడతాము. ఈ జ్ఞాన పక్రియలో సంస్కృతం స్థానం, భారతీయ జ్ఞాన వ్యవస్థ వృద్ధిలో దాని పాత్ర అపారమైనది, ఆదర్శప్రాయమైనది.
సంస్కృతం ఒడిలో పెరిగిన భారతీయ నాగరికత, విభిన్న ప్రజలను ఏకం చేస్తూ జాతీయ ఐక్యతను చాటిచెప్పే తన స్ఫూర్తిని ఏర్పరచుకుంది. అది భారతదేశ స్ఫూర్తికి, దాని జ్ఞానానికి స్వరం. ఒకప్పుడు సంస్కృతంపై లోతైన అవగాహన ఉన్న ఆసియా పండితులు, శతాబ్దాలుగా ఆకర్షణను రేకెత్తించిన ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, ఇతర ఇతిహాసాలు, గ్రంథాలలోని అద్భుతమైన వ్యక్తీకరణల లోని అనిర్వచనీయమైన ఆలోచనా పక్రియలను గ్రహించడానికి ప్రఖ్యాత భారతీయ సంస్థలకు వచ్చేవారు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన గ్రీకు గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త పైథాగరస్ తన జ్యామితి ప్రాథమికాలను శుల్బ సూత్రాల నుండి నేర్చుకున్నారు. అర్థశాస్త్రం అనే గ్రంథం లేదా రాజనీతి శాస్త్రం, సంస్కృత పండితుల కృషి వల్ల 1909లో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మన జీవితాలపై ప్రభావం చూపడానికి, వెలుగులోకి రావడానికి, మనం అర్థం చేసుకోవ డానికి ఎన్నో పత్రాలు, గ్రంథాలు వేచి ఉన్నాయి. సంస్కృతం వాడుక నుండి కనుమరుగైతే మనం ఆ భావనలను కోల్పోతాము.
స్వల్పకాలిక, దీర్ఘకాలిక దృక్కోణాల నుండి చూసినా, నేడు సంస్కృతం మరింత అవసరం. యుగయుగాలుగా ఇది క్రమంగా వాడుక నుండి కనుమరుగైంది. ప్రపంచీకరణకు దారితీసిన స్వేచ్ఛా విపణి ఆర్థిక వ్యవస్థ సుడిగాలి లాంటి గాలుల ద్వారా ప్రవేశించిన నేటి సంపద సృష్టి విధానాలలో సంస్కృతం ప్రాసంగికత (=వశ్రీవఙవఅమీవ)ఏమిటి? అని నేడు మనం అడుగుతున్నాం.
అపారమైన జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం
మన పవిత్ర గ్రంథాలలో, మన పూర్వికులు ప్రశ్నలను స్వాగతించిన వైనాన్ని మనం గమనిస్తాము. ఉపనిషత్తులు, భగవద్గీత జీవితంలోని అనేక ప్రశ్నలకు సమాధానమిస్తాయి. ప్రశ్నోపనిషత్తులో, ఆరుగురు శిష్యులు తమ గురువుతో ప్రకృతి, దేవుడు, విశ్వాసాలకు సంబంధించిన కొన్ని అత్యంత కఠినమైన భావనలను చర్చిస్తారు. మనం ప్రజా పరిపాలన, విజ్ఞానశాస్త్రం, నిర్వహణ, గణితం లేదా ఖగోళశాస్త్రం వంటి విషయాలను తీసుకుంటే, మనం కూడా దాదాపు ఇదే రీతిలో వాదించగలిగే స్థితిలో ఉండవచ్చు.
గతంలో రసాయన శాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, వృక్షశాస్త్రం, అనేక ఇతర రంగాలలో అద్భుత మైన పురోగతి సాధించామని సూచించడానికి పుష్కలమైన ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. హిందూ రసాయన శాస్త్ర చరిత్ర అని పిలిచే పుస్తకాలను అందించే గ్రంథాలు ఇప్పటికే ఉన్నాయి. మానవీయ శాస్త్రాల విషయంలో కూడా సంస్కృత అధ్యయనం ప్రాముఖ్యత స్పష్టంగా ఉండాలి.
అనాది కాలం నుండి ఈ భూమిని ‘భారత్’ అని పిలుస్తారు. ఇది జ్ఞాన కాంతిలో మునిగి ఉన్న (ఒక దేశం) అని అర్థం వచ్చే సంస్కృత పదం.
కానీ వలసవాదం తరువాత, ఇది భారతదేశంగా ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. మనం సంస్కృత భాషను మరచిపోయేలా నిర్బంధానికి గురయ్యాము. అందువల్లనే ఈనాడు మనం అసలైన ‘భారత్’ను, అంటే ఈ నేల జ్ఞాన నిధిని తిరిగి పొందవలసి ఉంది. ఆ నిధి గృహానికి సంస్కృతమే తాళంచెవి.
ఒక వ్యక్తి, సమాజం, దేశం అభివృద్ధిలో ఆత్మ గౌరవం అత్యంత ముఖ్యమైన కారకాలలో ఒకటిగా నిలుస్తుంది. ఒక దేశం తన గత విజయాలను, బలాబలాలను గుర్తించి, ఆ అనుభవాలను తర్వాతి తరాలకు అందించడం ద్వారా దేశం ఆత్మగౌరవం పెరుగుతుంది.
సమాజాలు పురోగమించడానికి, ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడానికి జ్ఞానమే కీలక అంశమని ఇప్పుడు గుర్తింపు పొందుతోంది. శాస్త్రవేత్తలకు, మేధావులకు సంస్కృతం తెలియకపోవడం వల్ల, వారు వేదాలు, శాస్త్రాలు, ఇతర సంస్కృత గ్రంథాలలో నిగూఢంగా ఉన్న జ్ఞానాన్ని విశ్లేషించి వెలికితీయడానికీ, కనీసం దానిని అంచనా వేసి, ప్రశంసించడానికీ కూడా వీలులేని స్థితిలో ఉన్నారు. అత్యంత అవసరమైన ఈ జ్ఞాన విస్ఫోటనంలో ఇదే అతిపెద్ద అడ్డంకి. భాషాపరమైన ఈ అడ్డంకి అనే మహా సవాలును అధిగమించినప్పుడే భారత్ సుసంపన్నమై, ప్రపంచాన్ని జ్ఞానవంతం చేయగలదు. ‘జ్ఞాన ప్రపంచానికి’ నాయకత్వం వహించడానికి మనకు గతంలో కంటే ఇప్పుడు సంస్కృతం మరింత అవసరం.
గతకాలపు అవశేషమా లేక నిధి భాండాగారమా?
మనం సంస్కృతాన్ని గతకాలపు అవశేషంగా చూడాలా లేక సాంప్రదాయ భారతీయ జ్ఞాన నిధిగా చూడాలా? అనే ప్రశ్న చాలా ప్రాథమికమైనది.
భారత్‌లో 50 లక్షల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. నకళ్లను పక్కన పెట్టినా కూడా, వాటిలో 96 శాతం ఎటువంటి మార్పులు చేయకుండా, అముద్రితంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన జాబితాలు కూడా తయారు కాలేదు. అవి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన 14 ప్రాచీన లిపులలో రాసి ఉన్నాయి. ప్రస్తుతం భారత జ్ఞాన వారసత్వపు పరిస్థితి ఇది! వాటిలో కొన్ని ఇతర చోట్ల లభించే తాళపత్ర గ్రంథాల నకళ్లు అయినప్పటికీ, వాటిలో పావు వంతు కంటే ఎక్కువ గ్రంథాలు ప్రచురించి, పండితుల సమాజానికి అందుబాటులోకి తీసుకురావడానికి తగినంత ముఖ్యమైనవి అని నమ్మడానికి కారణం ఉంది.
నిస్సందేహంగా మన జ్ఞాన భాండాగారం అంతా సంస్కృతం అనే మాధ్యమంలోనే భద్రంగా నిక్షిప్తమై ఉంది. చాలా భారతీయ భాషల పదజాలంలో 60 శాతానికి పైగా సంస్కృతం నుండే ఉద్భవించింది. అందువల్ల, ఇది అన్ని భారతీయ భాషలకు పూరకంగా ఉంది. సంస్కృతం భారతదేశ ప్రాంతీయ భాషలను కల్తీ లేకుండా పరిరక్షించడంలో సహాయ పడగలదు.
సంస్కృతం సాంఘిక సామరస్యానికి ఒక ప్రభావవంతమైన సాధనం. ఇది కుల, మత, లింగ, ప్రాంతీయ భేదాలను నిర్మూలించగలదు. మరోవైపు, సంస్కృత విద్యను అందించడానికి ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయి. మన ప్రాచీన జ్ఞానం నుండి లభించే ప్రయోజనాలను గ్రహించి, సంస్కృత గ్రంథాలలోని ఆసక్తికరమైన ఆలోచనలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సింది ప్రభుత్వం కాదు, మనలో ప్రతి ఒక్కరం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చైతన్యవంతమైన ప్రయత్నం చేస్తే, ఈ భాష ప్రాసంగికత, ఈ క్లిష్ట సమయాల్లో దాని ఉపయోగం ఆంగ్లం వలె ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ దిశగా, సంస్కృత భారతి సంస్కృతాన్ని వాడుక భాషగా ప్రోత్సహించడంలో గొప్ప సేవ చేస్తోంది. వారి తరగతులు మౌఖిక అభ్యాసాలు, సందర్భోచిత సంభాషణల ద్వారా భాగస్వామ్యంతో సాగుతాయి. ఒక ప్రత్యేకమైన బోధనా పద్ధతితో అభ్యాసకులకు ఇది సులభతరం చేస్తుంది. ఒరాకిల్, ఇంటెల్ మరియు ఎంఫసిస్ వంటి సంస్థల సాఫ్ట్‌వేర్ నిపుణులు తమ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కోర్సులను ప్రశంసించారు.
కాబట్టి, వృత్తి నిపుణులందరూ తమ అవ•ల్య మైన సమయాన్ని వెచ్చించి, అత్యంత విలువైన సంస్కృతాన్ని నేర్చుకోవాలని విజ్ఞప్తి. మన పూర్వికుల జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ప్రస్తుత ప్రపంచాన్ని ప్రభావితం చేసి, దానిని జీవించడానికి మరింత మంచి ప్రదేశంగా మారుస్తుంది. ఒకరు డాక్టర్, ఇంజనీర్, మేనేజర్, న్యాయవాది, సీఈఓ కావచ్చు. కానీ అది ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరూ సంస్కృతం నుండి తమ జ్ఞానాన్ని తప్పక సుసంపన్నం చేసుకో వాలి. ఈ రోజు నుంచే సంస్కృతం నేర్చుకోవడం ప్రారంభించండి.
– శిరీష్‌దేవ్ పూజారి, అఖిలభారతీయ సంపర్క్ ప్రముఖ్, సంస్కృతభారతి





