
మతం, ఇది రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానికి డీఎంకే ఓటమి ఒక ఉదాహరణ. రాజకీయ నాయకులు మేం ఏది మాట్లాడిన చెల్లుతుందని అనుకుంటే పొరపాటే. హిందూ మతంపై ఉదయనిధి స్టాలిన్ తో సహా పలువురు డీఎంకే మంత్రులు, నేతలు అవాకులు చెవాకులు పెలారు. ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఏకంగా ‘‘సనాతన ధర్మాన్ని’’ నిర్మూలిస్తాం అంటూ స్టేట్‌మెంట్ ఇవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదం అయింది.
ఇదే కాకుండా తిరుప్పరకుండ్రం సుబ్రమణ్య స్వామి కొండ వివాదం కూడా డీఎంకేను హిందువుల దృష్టిలో విలన్‌గా మార్చింది. కుమారస్వామి కొండపై దీపం వెలిగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చినా, ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటూ, మైనారిటీ సంతుష్టీకరణకు పాల్పడింది. అప్పటి నుంచే హిందువుల దృష్టిలో విలన్‌గా మారింది. ద్రవిడ మోడల్, డెవలప్‌మెంట్ నమూనా అంటూ డీఎంకే ఊదరగొట్టినా చివరకు ఘోర ఓటమి పాలైయ్యింది.





