News

లా యూనివర్సిటీల్లో మనుస్మృతి, అర్థశాస్త్రం, విలవలు బోధించాలి : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

44views

దేశంలోని ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాలు అత్యంత ప్రతిభావంతులైన పట్ట భద్రులను తయారు చేస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి అన్నారు. అయితే.. వారు తమ తమ సాంస్కృతిక సైద్ధాంతిక మూలాలకు క్రమంగా దూరమవుతున్నారని, అది దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు తమ సమకాలీనుల కంటే ఎంతో ముందంజలో వున్న మేధావులను తయారు చేస్తున్నాయని, అయితే అత్యంత వేగంగా కోటీశ్వరులుగా మారాలన్న అంతిమ లక్ష్యంతోనే వారు ముందుకు సాగుతున్నారని, ఇది ప్రధాన లోపమని అన్నారు. వీరిలో అత్యధికులు తమ సాంస్కృతిక, తాత్విక మూలాలకు కూడా దూరమవుతున్నారని, వాటితో పూర్తిగా సంబంధాలు తెగిపోయే ప్రమాదం వుందన్నారు.అవి జైన, బౌద్ధ సూత్రాలైనా, మనుస్మృతి లేదా అర్ధశాస్త్ర సిద్ధాంతాలైనా సరే.. వాటికి దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘ఈ గ్రంథాలన్నింటికీ సుసంపన్నమైన సాహిత్యానికి మధ్య పరస్పర సంబంధం వుంది. న్యాయ విద్యార్థులు దీనిని తప్పకుండా గ్రహించాలి. వీటి ద్వారా వచ్చే ఆలోచనలతో న్యాయవిద్యార్థులకు పరిపక్వత, ఓ స్థిరత్వం చేకూరుతుంది.అలాగే ఈ గొప్పదైన దేశంలో జన్మించినందుకు మన విధులను ,కర్మలను ఎలా వ్యవహరించాలో వారికి తెలిసి వస్తుంది. అలాగే భారతీయ సంస్కృతి గురించి కూడా ఆ గ్రంథాల ద్వారా తెలుస్తుంది’’ అని న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అన్నారు.

అలాగే న్యాయవిద్యలో భారతీయ జ్ఞానాన్ని కూడా అంటే మనుస్మృతి, అర్థశాస్త్రం వంటి భారతీయ గ్రంథాలను కూడా అందులో కలిపేయాలన్నారు.‘‘ఎలాంటి ఇబ్బందుల నుంచిైనా, ప్రతిదాడుల నుంచిైనా భారతీయ నాగరికతకు శాశ్వతాన్ని తెచ్చిపెట్టి, వెన్నెముకగా నిలిచాయి భారతీయ శాస్త్రాలు. భారతీయ సంస్కృతి, విలువలు, సంప్రదాయాలపై ఓ ప్రత్యేకమైన కోర్సునుఅన్ని న్యాయ పాఠశాలల పాఠ్యప్రణాళికలో తప్పనిసరిగా చేర్చడం ఆవశ్యకం.”పంచతంత్ర కథలు, జాతక గాథలు, చాణక్యుని ఉపదేశాలు, అలాగే అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించే సమయంలో పొందిన చర్చలు మరియు బోధనలు—ఇవన్నీ మన భారత రాజ్యాంగంలోని వివిధ భాగాలలో ప్రతిబింబిస్తున్నాయి; వీటిని యువ న్యాయ విద్యార్థులకు, మరీ ముఖ్యంగా దేశంలోని అగ్రశ్రేణి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల (NLUs) విద్యార్థులకు తప్పనిసరిగా బోధించాలి,” అని ఆయన అన్నారు. అని పేర్కొన్నారు.