News

సమరసత కృషితో చిన్నారులకు ఆధ్యాత్మిక వికాసం

48views

నేటి పోటీ ప్రపంచంలో పిల్లలకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ఆధ్యాత్మిక, నైతిక విలువలు ఎంతో అవసరమని బ్రాండిక్స్‌ భారతీయ భాగస్వామి దొరస్వామి అన్నారు. అనకాపల్లిలోని  స్థానిక శ్రీరామ్‌నగర్‌ మాధవ సదన్‌లో సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బాలవికాస్‌ కేంద్రాల వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో ఉత్తమ గుణగణాలను పెంపొందించేందుకు సమరసత సేవా ఫౌండేషన్‌ చేస్తున్న సామాజిక సేవల విషయంపై ఆయన వివరించారు. సాంకేతికత పెరిగిన ఈ కాలంలో మన సంస్కృతిని, సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ఫౌండేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి విష్ణు మాట్లాడుతూ సామాజిక సమరసత సాధించడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల దేవాలయాల్లో నిర్వహిస్తున్న బాలవికాస్‌ కేంద్రాల ద్వారా పేద వర్గాల పిల్లలకు క్రమశిక్షణ, దేశభక్తి, ధార్మిక విషయాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు, నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.