News

హైదరాబాద్ లవ్ జిహాద్ కేసుకి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు

53views

హైదరాబాద్ లో సంచలనం రేపిన లవ్ జిహాద్ కేసుకి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షాత్తూ బాధితురాలే ఈ విషయాలన్నీసోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి, బయటపెట్టింది. ‘‘లవ్ జిహాద్’’ అనేది నిజంగా వుంది.. దానికి తాను కూడా బాధితురాలినేనని వాపోయింది.

నెల్లూరుకి చెందిన నవాజ్ అనే వ్యక్తి గతేడాది మే నెలలో కూకట్ పల్లిలో ట్రేడింగ్, ఫుడ్ బిజినెస్ పేరుతో తమ కుటుంబానికి పరిచయం అయ్యాడని, తాను హిందువుగా మారినట్లు తమను నమ్మించాడని తెలిపింది. అలాగే తన పేరును నవాజ్ కాకుండా నవదుర్గ అని మార్చుకున్నట్లు ఏకంగతా సర్టిఫికేట్ కూడా తమ ముందు వుంచాడని, నవాజ్ సోదరులు కూడా అదే చెప్పి మోసం చేశారని పేర్కొంది. భవిష్యత్తులో దుబాయ్ వెళ్లిపోదామని మాయ మాటలు చెప్పి, తనను మోసం చేశారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తామిద్దరమూ గత యేడాది జూలైలో పెళ్లి చేసుకున్నామని, పెళ్లి సమయంలోనే తన పేరును నజీరాగా మార్చేశారని వెల్లడించింది.

ఇక నవాజ్‌కు అప్పటికే 2 పెళ్లిళ్లు అయినట్లు తనకు అక్టోబర్ నెలలో తెలిసిందని బాధితురాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే తనను బెదిరించడం మొదలు పెట్టాడని.. గుల్బర్గాలోని ఖాజా నవాజ్ దర్గా వద్దకు తీసుకెళ్లి బలవంతంగా మతం మార్పించినట్లు తెలిపింది. ఆ తర్వాత కల్మా చదివించాడని పేర్కొంది. అతడు చెప్పిన మాట వినకపోతే తీవ్రంగా కొట్టేవాడని.. బలవంతంగా బీఫ్ తినిపించేవాడని కూడా వెల్లడించింది. తనకు మత్తు మందు ఇచ్చి, బేగంపేట రిసార్ట్ లో అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా అతని తమ్ముళ్లు మునవార్, షారూక్, ఇస్మాయిల్ లు కూడా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వాపోయింది.

తనపై అత్యాచారం చేసిన సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి.. వాటిని అడ్డం పెట్టుకుని నవాజ్ తనను బ్లాక్ మెయిల్ చేశాడని మీడియాకు వెల్లడించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తన తల్లి, చెల్లెల్లను హతమార్చుతానని బెదిరించినట్లు వెల్లడించింది. ఇవన్నీ దారుణాలు తట్టుకోలేక తాను కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొంది.

నవాజ్ అనే ముస్లిం వ్యక్తి కూకట్ పల్లి పరిధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని, అక్కడే వున్న యువతిని వలలో వేసుకోవడానికి ప్లాన్ వేశాడు. తాను ముస్లిమని చెబితే నమ్మదని తెలిసి, హిందువు లాగా నటించాడు. ఆ యువతికి వంద శాతం నమ్మకం కలిగేలా ప్రవర్తించి, ప్రేమతో లోబర్చుకున్నాడు. దీని తర్వాత గత యేడాది జూన్ మాసంలో వివాహం కూడా జరిగింది.

పెళ్లైన మొదటి రోజు నుంచే నరకం చూపటం ప్రారంభించాడు. పెళ్లి రోజు రాత్రి నవాజ్ తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. పార్టీ పేరుతో తన స్నేహితులను, సోదరులను ఇంటికి ఆహ్వానించాడు. బాధితురాలికి మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై నవాజ్ స్నేహితులు, సోదరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భర్తే స్వయంగా ఈ ఘాతుకానికి ప్లాన్ చేశాడని తెలిసి ఆ యువతి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

ఆ యువతిని మానసికంగా, శారీరకంగా హింసించడమే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతీశాడు. ఆమెకు చెందిన విలువైన ప్లాట్‌ను, బంగారాన్ని బలవంతంగా లాక్కున్నాడు. అంతటితో ఆగక, ఆమె పేరు మీద బ్యాంకుల్లో భారీ మొత్తంలో లోన్లు కూడా తీయించాడు. వీటన్నింటి తర్వాత యువతికి అసలు విషయం తెలిసింది. ఇప్పటికే నవాజ్ కి రెండు పెళ్లిళ్లు అయ్యాయని, తాను మోసపోయాయని తెలిసింది.
దీంతో యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.