
కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం మండలం సిరిపురంలోని చిన్గగనానందా గీతా శ్రమంలో 52వ భక్తి, జ్ఞాన వేదాంత మహాసభలు ఘనంగా ముగిసాయి. విజయనగరం జిల్లా గంగచోళ్లపెంట జ్ఞానానంద గీతా శ్రమం పీఠాధిపతి యోగానందా భారతీస్వామి ఆధ్వర్యంలో వేదాంత మహాసభలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. మహా సభలకు పలు ఆశ్రమాల నుంచి పీఠాధిపతులు హజరయ్యారు. ముగింపు రోజున గురుదేవుడు చిద్గగనందాస్వామి చిత్రపటాన్ని ఊరేగింపు. ఆశ్రమ వ్యవస్థాపకుడు అచ్యుతానందాస్వామివారి శిలావిగ్రహానికి పూజలు నిర్వహిం చారు. మహసభల్లో భాగంగా ప్రతిరోజు ప్రణో వపాశన, సూర్య నమస్కారాలు, భజనలు, గీతాపారాయణ, యజ్ఞాలు నిర్వహించారు. పలు ఆశ్రమాల పీఠాధిపతులు వేదాంతమహ సభల్లో అధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజ రైన బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చిలుకూరి రామ ుమార్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. కార్య క్రమంలో బీజేపీ నేత కొల్లాశ్రీనివాస్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





