
82views
గుజరాత్‌లో ఉమ్మడి పౌరస్మృతి(UCC) అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు 2026ను గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. యూసీసీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తుది నివేదికను సమర్పించిన వారం రోజుల తర్వాత ఈ బిల్లును అసెంబ్లీ ముందుకు తెచ్చారు. దీనిపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించిన రెండో రాష్ట్రంగా గుజరాత్ నిలుస్తుంది. ఫిబ్రవరి 2024లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మొదట ఈ బిల్లును ఆమోదించి, అమలు చేస్తోంది.





