News

వికాస భారతి ఆధ్వర్యంలో కీర్తిశేషులు నాగేంద్ర ప్రసాద్ సంస్మరణ సభ

285views

వికాస భారతి ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో కీర్తిశేషులు నాగేంద్ర ప్రసాద్ సంస్మరణ సభ కాల్వ బుగ్గ సురభి గోశాల, భారతీయ స్ఫూర్తి కేంద్రంలో నిర్వహించారు. ఆయనను ఎంతగానో అభిమానించి ఆరాధించే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగేంద్ర ప్రసాద్ తో వారి కున్న అనుభవాలను జ్ఞాపకాలను ఈ వేదికగా అందరితో పంచుకున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ కార్యకర్తలకు పల్లెపరివర్తన, పల్లె జాగృతి, గోమాత పూజలు, శ్రీరామ లిఖిత జప యజ్ఞం, గోమాత భక్త సమ్మేళనం, స్వాతంత్ర సమరయోధుల సంస్మరణ ఉత్సవాలు, బాల ప్రబోధిని, యువ సమ్మేళనం, సొంత వృత్తుల వారి సమ్మేళనం, సహస్ర గల జాతీయ గీతాలాపన, ఇలా వందలాది కార్యక్రమాలు అనుభవాలను ఈ వేదికగా పంచుకున్నారు.

ఇందులో భాగంగా జ్యేష్ట కార్యకర్త డాక్టర్ కాదర్ బాద్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ, కీర్తిశేషులు బివియన్ ప్రసాద్ గారు, చిన్న వయసులోనే సంఘ గణవేషను ధరించి, శాఖకు వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. వారిలోని జాతీయ భావాలు చిన్నప్పటి నుండే ప్రస్ఫుటమయ్యేవని ఒక స్వయంసేవక్ గా ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో , అలాంటి లక్షణాలు సంపూర్ణంగా కలిగినటువంటి వ్యక్తి అని పేర్కొన్నారు. కార్యకర్తలకు దిశా నిర్దేశంచేయటంలోనూ , వారికి ప్రేరణ కలిగిస్తూ కార్యోన్ముఖులను కావించుటలోనూ వారు దిట్ట అని ఆధ్యాత్మికతని , ధార్మికతని , సంస్కృతిని, జాతీయతను కలగలిపి సమాజాన్ని చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు రచించడంలో సిద్ధహస్తులని తెలిపారు. వారి జీవితం మన అందరికీ ఆదర్శం అని వివరించారు.