
100views
కాంగ్రెస్ నేతల ఉనికి ఎక్కడ ఉంటే అక్కడ హిందు ఆలయాలపై దాడులు పరిపాటి అన్నట్టుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీలోని మూడు హిందూ దేవాలయాలపై దుండగులు దాడులకు తెగబడ్డారు. శివాలయం, హనుమాన్ మందిరం, హర్షకని దేవీ మందిరాలను లక్ష్యంగా చేసుకొని, దాడికి దిగారు. దేవాలయంపై దాడి చేయడమే కాకుండా విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. అంతేకాకుండా దేవాలయంలోని పూజా సామాగ్రిని కూడా చెల్లాచెదురుగా పడవేశారు. ముఖ్యంగా రాధా దేవి విగ్రహాన్ని కూడా పెకలించి వేశారు. దేవాలయానికి చెందిన ఓ గంటను కూడా దొంగలించారు. దీంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
దేవాలయంపై దాడి జరిగిందని సమాచారం అందడంతో మిగతా గ్రామస్థులు ఆందోళనకు దిగారు.దీంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. సమాచారం అందిన వెంటనే అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ కుమార్ సిన్హా భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
2023లోనూ ఇలాగే జరిగింది. మీరట్‌లో ఓ దేవాలయంలో విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ప్రజలు నిరసనలకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని, అనుమానితులను అరెస్ట్ చేశారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. పలు హిందూ ఆలయాలపై ముస్లింల దాడులు, ఆ పైన అది ఎవరో పిచ్చివాడు చేశాడు… అంటూ పోలీసులు కేసును బలహీనపరచడం కనిపిస్తోంది.





