
835views
విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో మహాశివరాత్రి సందర్భంగా స్థానిక మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ రాత్రంతా జాగరణ చేశారు. ఈ సందర్భంగా యాదవ పరియోజన ధర్మ రక్ష సమితి వారు సహస్ర దీప లింగార్చన, భరతమాత పూజ, శ్రీ శ్రీ శివ స్వామి గారిచే శ్రీశైల క్షేత్రం నుండి తెప్పించ బడిన శివలింగమునకు అభిషేకము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది స్థానికులు పాల్గొన్నారు.



యాదవ పరియోజన ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా డీ ఎస్ పి శ్రీ వేలూరు గణేష్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ధర్మ జాగరణ సమితి ప్రాంత సహ పరియోజన ప్రముఖ్ శ్రీ రాయుడు ముత్యాలరావు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.





