
స్వాత్రంత్ర్య ఉద్యమ సమయంలో ఇక్కడి ముస్లింలను పాక్‌కు.. అక్కడి హిందువులను భారత్‌కు తరలించకపోవడం వల్లే ఇప్పుడు దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోందని భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. సీఏఏకు అనుకూలంగా బిహార్‌లోని పూర్ణియా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
”ఆంగ్లేయుల నుంచి విముక్తి కోసం మన పూర్వీకులు పోరాడితే జిన్నా ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం పనిచేశారు. అదే సమయంలో మన పూర్వీకులు ఓ తప్పుచేశారు. ఇక్కడున్న ముస్లిం సోదరులను అక్కడికి పంపించి అక్కడున్న హిందువులను అప్పుడే తీసుకొచ్చుంటే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అవసరం వచ్చేదే కాదు” అని గిరిరాజ్ సింగ్ చెప్పుకొచ్చారు. అప్పట్లో అది జరగకపోవడం వల్లే ఇప్పుడు దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోందని వ్యాఖ్యానించారు.

దేశ విభజన సమయంలో ముస్లిముల చేతిలో హతమైన హిందువుల శవాలను పీక్కు తింటున్న రాబందులు
పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లో మత పీడన కారణంగా దేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో సీఏఏను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తుండగా భాజపా దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.





