
105views
పల్నాడు జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు విదేశీ ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన గ్లోబల్ మార్కెటింగ్ బృందం.. పెదకూరపాడు మండలం పెదకూరపాడు గ్రామంలో రైతు దర్శి శేషారావు మిరప పొలాన్ని సందర్శించింది. రసాయనాలు వినియోగించకుండా కషాయాలు, జీవామృతంతో పంటలను సాగు చేస్తున్న విధానాన్ని బృందం పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్‌లో మిరప ప్రధాన వాణిజ్య పంట అని, దాన్ని ప్రకృతి విధానంలో పండించడం అభినందనీయమని సభ్యులు పేర్కొన్నారు. ప్రధాన పంటతో పాటు ముల్లంగి, ఉల్లి, బీట్‌రూట్, క్యారెట్, టమోటా, మొక్కజొన్న, కంద, బంతి వంటి అంతర పంటలు, జొన్న, సజ్జలను రక్షక పంటలుగా సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తున్నట్లు రైతు కుటుంబ సభ్యులు వివరించారు. తద్వారా ఉత్పత్తులకు మార్కెట్ ధర కంటే మెరుగైన ధర వస్తోందని తెలిపారు.





