
831views
విజయవాడలోని నులక పేట సమీపంలోగల గోకులాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. 18/2/2020 మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుండి శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి మరియు ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య గార్ల సమక్షంలో గోకులాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. సహ ప్రాంత పరియోజన ప్రముఖ్ శ్రీ ముత్యాలరావుచే ప్రారంభించబడిన కార్యక్రమం నులకపేటలో ప్రారంభమై ఎర్రబాలెం, పెనుమాక, తాడేపల్లిల మీదుగా మరలా నులకపేట వద్ద ముగిసింది.

ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాలలో ఉన్న గ్రామదేవతలకు పసుపు, కుంకుమ, సారె సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ధర్మ జాగరణ పరియోజన ప్రముఖ్ శ్రీ కాకుమాను భాగేశ్వరరావు తో పాటు శ్రీ సతీష్ కుమార్, శ్రీ వెంకట నరసింహారావు, శ్రీ శశి కుమార్ మరియు ఇతర కార్యకర్తలు, హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





