
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సప్తశక్తి సంగమ్ ముగింపు కార్యక్రమం విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన విద్యా భారతి అఖిల భారతీయ సప్తశక్తి సంగమ్ టోలి సభ్యురాలు మరియు సప్తశక్తి సంగమ్ దక్షిణ క్షేత్ర మరియు దక్షిణ మధ్య క్షేత్ర సంయోజిక్ డాక్టర్ భండారు ధరణి ప్రియ సంయోజక ప్రస్తావన గావించారు .

దేశం మొత్తంలో 25 వేల మాతృ సమ్మేళనాల్లో 30 లక్షల మంది మాతృమూర్తులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రాంతంలో 280 కార్యక్రమాలలో 28,000 వేల మాతృమూర్తులు పాల్గొన్నారు అని వివరించారు . కుటుంబ ప్రబోదన్, పర్యావరణ సంరక్షణ తో పాటు మహిళలు చేయవలసిన యోగ దానం గురించి వక్తలు సందేశాలు ఇచ్చారు. మహిళ తనలోని సప్తశక్తులను జాగృత పరుచుకొని దేశానికి ఎలా సేవ చేయాలో వివరించారు.

గౌరవ అతిథిగా పాల్గొన్న క్రాలేటి వెంకట భాను మాట్లాడుతూ మహిళలు కుటుంబాన్ని పటిష్టం చేసుకోవాలని తెలిపారు ప్రధాన వక్త డాక్టర్ టీ రాధాబాయి (రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజేపిఎన్ కళాశాల) ప్రసంగిస్తూ … భారతీయ సంస్కృతిలో వ్యక్తి తనను తాను నిర్మాణం చేసికొని… తనతో పాటుగా సమాజం, దేశం, విశ్వం, సృష్టిని సమన్వయించు కుంటారని, ఇందులో మహిళల పాత్ర కీలకం అని వివరించారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన భాగ్యలక్ష్మి భారత దేశ ఉన్నతిలో మహిళలు సాధించిన విజయాలు, వారి నుండి మనం గ్రహించవలసిన విషయాలను తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంయోజక్ లు అంజలి ప్రసాద్, ఉమా దేవి కార్యక్రమాన్ని యోజనా బద్దంగా నిర్వహించారు. సుమారు 850 మంది మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





