News

పురాతన విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

109views
మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లా సిరోంజ్ తహసీల్‌లోని గోపాల్‌నగర్ గ్రామంలో ఓ పురాతనమైన విష్ణువు ఆలయంలోకి చొరబడిన దుండగులు గర్భగుడిలోని పురాతనమైన విష్ణువు విగ్రహంతో పాటుగా మరికొన్ని రాతి విగ్రహాలను ధ్వంసం చేశారు. దుండగులు ఉద్దేవపూర్వకంగానే ఈ చర్య చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పురావస్తు శాఖతో నడుపుతున్న ఈ మందిరానికి గణనీయమైన మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల నాటిది. అలాంటి ఈ గుడిలో ధ్వసం జరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. , పురావస్తు శాఖ రక్షించే మతపరమైన స్థలంలో ఇలాంటి సంఘటన జరగడం వల్ల స్తానిక పరిపాలన విఫలమైందని వారు విమర్శించారు.

ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం మందిర్ ప్రధాన పూజారి తమ్ముడు మోను శర్మ ఆలయానికి వచ్చి ప్రధాన ద్వారం తాళం విరిగి ఉండటాన్ని గమనించాడు. లోపల, రెండు గర్భగుడి తాళాలు కూడా పగలగొట్టబడి ఉన్నాయి. గర్భగుడి లోపల, భగవాన్ విష్ణువు యొక్క పురాతన రాతి మూర్తి పాదాల వద్ద విరిగిపోయి కనిపించింది, పక్కనే ఉన్న మరోగుడిలో ఉన్న కొత్త మూర్తి కూడా అదే విధంగా దెబ్బతిన్నట్లు కనిపించింది. మందిరంలోని ఇతర విగ్రహాలు మరియు వస్తువులు కూడా ధ్వంసం చేయబడ్డాయి. ఒక పెట్టెలో నిల్వ చేసిన బట్టలు, వస్తువులు నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి, దాడి చేసినవారు విలువైన వస్తువుల కోసం వెతికారని తెలుస్తుంది.

చాలా సంవత్సరాల క్రితం, పురాతన విగ్రహంలో కొంత భాగం దెబ్బతిన్నదని, దీని వలన కొత్త గర్భగుడి నిర్మాణం , కొత్త మూర్తిని ప్రతిష్టించడం జరిగిందని, అసలు విగ్రహం అలాగే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ దాడిలో పురాతన , కొత్త విగ్రహాలు రెండూ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తులు మరియు హిందూ సంస్థల సభ్యులు గుడి వద్ద గుమిగూడి, గోపాల్‌నగర్-దీకంఖేడ రహదారిని దిగ్బంధించి, 48 గంటల్లోగా నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మందిరానికి రక్షిత హోదా ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని , సమగ్ర దర్యాప్తు మరియు త్వరిత చర్య తీసుకుంటామని నిరసనకారులకు హామీ ఇచ్చారు.

విదిష నుండి వచ్చిన డాగ్ స్క్వాడ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించింది మరియు వేలిముద్ర నిపుణులను నేరస్థలాన్ని పరిశీలించడానికి నియమించింది, పోలీసులు ఈ విషయాన్ని అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారని నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.