News

కాశ్మీర్ తీసుకుంటారా..? పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సెటైర్లు..

93views

కాశ్మీర్‌ను భారత్ నుంచి స్వాధీనం చేసుకుంటామని, కాశ్మీర్ పాకిస్తాన్ ‘‘జీవనాడి’’ అని, ఏదో రోజు పాకిస్తాన్‌లో భాగమవుతుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌కు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ధీటుగా సమాధానం ఇచ్చారు. పాక్ వద్ద ఉన్న ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(పీఓకే)నే సరిగా చూసుకోవడం లేదని వారికి కాశ్మీర్ కావాలా.? అని ప్రశ్నించారు.

పాక్ ప్రధానిపై సెటైర్లు పేలుస్తూ.. ‘‘మేము పాక్‌లో కలుస్తామా.? వారి వద్ద ఉన్న దానినే సరిగా నిర్వహించుకోవడం లేదు, మమ్మల్ని తీసుకుని వాళ్లు ఏం చేస్తారు.?’’ అని ప్రవ్నించారు. గురువారం పాకిస్తాన్ ‘‘కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం’’ పాటించింది. పాకిస్తాన్ ప్రజల, పాక్ నాయకత్వం తరుఫున కాశ్మీర్‌లోని మన సోదరులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని పేర్కొంటూ.. మహ్మద్ అలీ జిన్నా కాశ్మీర్‌ను దేశానికి ‘‘జీవనాడి’’ అని ప్రకటించిన విషయాన్ని షెహబాజ్ షరీఫ్ గుర్తు చేశారు. కాశ్మీర్ పాక్‌లో భాగం అవుతుందని ప్రగల్భాలు పలికారు.