News

నవతరానికి సనాతన ధర్మాన్ని అందించాలి

271views

సనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలని టిటిడి ఇంఛార్జ్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. వేలాది సంవత్సరాలుగా మన పూర్వికులు అందించిన శాస్త్రం, సంప్రదాయాలు, సనాతన వారసత్వ సంపదకు సాంకేతికతను జోడించి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అర్చక, పరిచారిక వేదపారాయణందారుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇంఛార్జి ఈవో మాట్లాడుతూ టీటీడీ పరిధిలోని వివిధ ఆలయాలలో విధులు నిర్వహిస్తున్న 35 మంది అర్చకులు, పరిచారకులు మరియు 15 మంది వేద పారాయణదారులకు మూడు రోజులపాటు పునఃశ్చరణ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్చకులు, పరిచారకులు, వేద పారాయణదారులు నిత్యం నిర్వహించే కైంకర్యాలను మరింత శుద్ధిగా, నియమబద్ధంగా నిర్వహించేందుకు ఈ పునఃశ్చరణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.