News

శబరిమల ఆలయంలో సినిమా షూటింగ్‌ వివాదం

154views

శబరిమల ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆలయ సన్నిధానంలో సినిమా షూటింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డు-TDB స్పందించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

శబరిమల ఆలయంలో సన్నిధానం ప్రాంతంలో మలయాళ దర్శకుడు అనురాజ్‌ మనోహర్‌ వీడియోగ్రఫీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై టీడీబీ అధికారిక ప్రతినిధి స్పందించారు.‘‘వీడియోగ్రఫీకి అనుమతి కావాలని మనోహర్ బోర్డును కోరినా అందుకు అనుమతి లభించలేదు. శబరిమల యాత్ర సీజన్‌కు ముందు గుర్తింపు ఉన్న మీడియా వ్యక్తులకు మాత్రం అనుమతి ఉంటుంది. ఈ షూటింగ్ వ్యవహారంపై ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తాం. డైరెక్టర్ ఎక్కడ షూటింగ్ చేశారో మాకు తెలియదు’’ అని వెల్లడించారు. తాను సన్నిధానం ప్రాంతంలో వీడియో తీయలేదని, పంపానది వద్ద తీశానని డైరెక్టర్‌ చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా సన్నిధానం వద్ద సినిమా షూటింగ్‌, వీడియోగ్రఫీ చేయడం నిషిద్ధం.