News

దివ్యాoగ బాలునికి ట్రై సైకిల్ వితరణ చేసిన సక్షమ్

1.4kviews

క్షమ్ (సమదృష్టి,క్షమతా వికాసం మరియు అనుసంధాన మండలి) దివ్యాoగుల కోసం పని చేస్తున్న అఖిల భారత సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జాతీయ నిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి గారి సహకారంతో వింజమూరు మండలం, కిస్తీపురం పంచాయితీ, చింతలపాలెం గ్రామానికి చెందిన గంగపట్ల తిరుమలయ్య కుమారుడు గంగపట్ల సంపత్ కుమార్ అనే దివ్యాoగ సోదరుడికి మూడు చక్రాల సైకిల్ని అందజేసి అతని కుటుంబాన్ని ఆదుకున్నారు. మండలంలో దివ్యాoగులకు సంబంధించి ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కారం దిశగా ప్రయత్నిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో RSS వింజమూరు నగర కార్యవాహ, ప్రభుత్వ ఉపాధ్యాయులు  శ్రీ వావిలాల చలమయ్య, సక్షమ్ సభ్యులు శ్రీ వడ్డే పరబ్రహ్మయ్య, బిజెపి యువనాయకుడు శ్రీ మల్లం కొండారెడ్డి, ప్రత్యేక ఉపాద్యాయులు మధు, బాషా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.