News

హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం – కఠిన చట్టాలు లేక బరితెగిస్తున్న జిహాదీలు

226views

ప్రముఖ దేవాలయాలు, పవిత్ర హిందూ స్థలాలు, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలు తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, కాణిపాకం ఇలా ఒకటేమిటి అనేక దేవాలయాలు, పరిసర ప్రాంతాల్లోకి క్రిస్టియన్లు, ముస్లింలు చొచ్చుకు వస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో తిరుమలలో ఓ వ్యక్తి ఏకంగా నమాజ్ చేసిన వీడియో వైరల్ అయింది. అన్యమత ప్రచారం చేస్తే కఠినంగా శిక్షస్తామంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తరవాత మాత్రం ఎప్పటి మాదిరే అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది.

తిరుమల ఏడు కొండలు పవిత్ర స్థలాలు, కోట్లాది హిందువుల నమ్మకం. ఇక తిరుమలకు ప్రవేశించే అలిపిరి గేటు సమీపంలో ఓ ముస్లి సంస్థకు గత ప్రభుత్వం భూములు కట్టబెట్టింది. అక్కడ హోటల్ నిర్మించడంతోపాటు మసీదు కూడా నిర్మించబోతున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, తరవాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఆ అరాచకానికి తెరబడింది.

ఇక శ్రీశైలంలో తరచూ మాంసాంహారాలు తినడం, భక్తులు భ్రమరాంబమల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకున్నాక, భక్తితో కొనుగోలు చేసే దారాలు, అంత్రాలు అమ్మే దుకాణాలు ముస్లింలకు కేటాయించడంలో అర్థం లేదు. దేశంలో ఒక్క మసీదు ప్రాంగణంలోని దుకాణాలు ఒక్క హిందువుకైనా ఇచ్చారా. అలాంటి ప్రాంతాల్లో హిందువుల కదలికలు ఉంటాయా. మరి శ్రీశైలంలో హిందూ భక్తులపై ముస్లిం వ్యాపారుల దౌర్జాన్యాలు పెరిగిపోతున్నా పట్టించుకున్న నాయకులు లేదు. ఓట్ల కోసం వెనకేసుకు వస్తే చివరకు దేశాన్ని బంగ్లాదేశ్ మాదిరి చేసే ప్రమాదం పొంచివుంది.

దేవాలయాల పరిసరాల్లో అన్యమత ప్రచారంతోపాటు ప్రముఖ దేవాలయాలకు సమీపంలో చర్చిల నిర్మాణం, మసీదుల నిర్మాణం పేరుతో కొందరు కోట్ల రూపాయలు చందాలు వసూలు చేస్తున్నారు. కుదిరితే ఓ చర్చి నిర్మించడం అక్కడ మైకులు పెట్టి జనాలను వేధించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. హిందూ దేవాలయాల నుంచి వచ్చే సుప్రభాతం ఇబ్బందిగా మారినప్పుడు, చర్చిల నుంచి వచ్చే అరుపులు, కేకలు, మసీదుల నుంచి రోజుకు ఐదుసార్లు వినిపించే నమాజులు జనాలకు ఇబ్బంది కలిగించవా. మైనారిటీలమని చెప్పుకుంటూ మెజారిటీ హిందువులపై దుమ్మెత్తి పోస్తూ దేశాన్ని జిహాదీల చేతుల్లో పెట్టే ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

దేశాన్ని, హిందూ దేవాలయాలను వేల సంఖ్యలో కూల్చి వేసిన మొఘల్ రాజుల గురించి చరిత్రలో గొప్పుగా విద్యార్థులకు పాఠాల రూపంలో నూరిపోస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారు. దేశంలో లక్షల దేవాలయాలను కూల్చి వేసిన ఔరంగజేబు, అక్బర్, బాబర్ గొప్ప పాలన అందించారంటూ చరిత్ర పాఠాలు పసి హృదయాల్లో విషం నింపుతున్నాయి. ఇక ఉదయం లేచినప్పటి నుంచి చర్చిల నుంచి వచ్చే దుర్గంధం, మసీదుల నుంచి వచ్చే విద్వేష మాటలకు హద్దే లేకుండా పోతుంది.

దేవాలయాల పవిత్రను కాపాడాలి. ప్రముఖ దేవాలయాలే కాదు, దేశంలోని అన్ని దేవాలయాలకు కనీసం 500 మీటర్ల పరిధిలో అన్యమత ప్రచారం నిషేధించాలి. అలా ప్రచారం చేసే వారిపై పీడీ యాక్టు ప్రయోగించాలి. ఇతర మతాలను గౌరవించలేని వ్యక్తులు దేశంలో నివశించడానికి అనర్హులు. లౌకిక రాజ్యంలో ఎవరి మతాన్ని వారు అనుసరించాలి. అంతేకాని ఇతర మతాలపై దుమ్మెత్తిపోస్తే తాటతీసే చట్టాలు అమలు చేయాలి.