
164views
హైందవ సంస్కృతి విస్తరణ, ప్రజల్లో భక్తిభావన పెంపు లక్ష్యంగా హిందూ ఆలయాలకు రాతితో పాటు విలువైన పంచలోహ విగ్రహాలను టిటిడి అందిస్తోంది. సనాతన ధర్మప్రచారంలో భాగంగా మైక్‌సెట్లు, గొడుగులు, శేషవస్త్రాలు, రాతి శిల్పాలు, పంచలోహ విగ్రహాలను రాయితీపై ఇస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది. ్య మైక్‌సెట్ కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ.25 వేలు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీలు 90% రాయితీపోనూ రూ.2,500లకు డీడీ పంపించాల్సి ఉంటుంది. ఇతరులు 50% రాయితీపోనూ రూ.12,500 చెల్లించాలి.





