
161views
అనంతపురం జిల్లా బుక్కపట్నంలోని పురాతన శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన హోయసల రాజ్యచిహ్నం వ్యాలను గుర్తించినట్లు ఉపాధ్యాయుడు గోపి తెలిపారు. ఆయన మాట్లాడుతూ వ్యాల అనేది క్రీ.శ. 11 నుంచి 14వ శతాబ్దం వరకు కర్ణాటకను పాలించిన హోయస రాజుల రాజ్య చిహ్నమన్నారు. దీన్ని ధైర్యం, శక్తికి ప్రతీకగా భావిస్తారన్నారు. విజయనగర సామ్రాజ్యానికి ముందు బుక్కపట్నం ప్రాంతం హోయసల రాజ్యంలో అంతర్భాగంగా ఉండేదన్నారు. ఇక్కడ మూడు వైష్ణవ దేవాలయాలను నిర్మించారని, వీటిలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఒకటన్నారు. క్షేత్రపాలకుడిగా ఆంజనేయస్వామి ఉన్నారన్నారు. ఈ ఆలయ స్తంభాలపై అద్భుత దేవతా శిల్పాలను చెక్కారని, హోయసల తర్వాత విజయనగర రాజులు రాజపోషకులుగా ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని వివరించారు.





