
ఇలా ప్రత్యేకంగా పది ఎకరాలను కేటాయించడంపై హిందువులు, సాహిత్యవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా సాహిత్యం పంపిణీ మెరుగుపరుస్తుందని, అలాగే గీతా ప్రెస్ కి వున్న సవాళ్లను కూడా అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై గీతా ప్రెస్ మేనేజర్ లాల్ మణి తివారీ మాట్లాడుతూ, ప్రెస్ చాలా కాలంగా స్థల పరిమితులను ఎదుర్కొంటోందని అన్నారు. “GIDAలో 10 ఎకరాల భూమి కేటాయింపు పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ప్రస్తుతం, మాకు దాదాపు 1.45 లక్షల చదరపు అడుగుల భూమి ఉంది, అది పూర్తిగా ఆక్రమించారు. స్థలం లేకపోవడం వల్ల మా పుస్తకాల ఉత్పత్తి, ఇతరత్రా విషయాల్లో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఆనందంగా వుంది. రాబోయే 100 సంవత్సరాలలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం మా లక్ష్యం, పెరుగుతున్న పాఠకుల సంఖ్యకు అనుగుణంగా సరఫరా ఉండేలా చూసుకోవడం’’ అని హర్షం వ్యక్తం చేశారు.
ఈ పది ఎకరాల భూమిని కేటాయించడంతో గీతా ప్రెస్ రూపు రేఖలు మారిపోతాయని, పుస్తకాల ఉత్పత్తిని విపరీతంగా పెంచుతామని బాధ్యులు పేర్కొన్నారు. ఈ పది ఎకరాల కేటాయింపుతో ప్రెస్ లో 81 కోట్లను పెట్టుబడి పెట్టి, కొత్త కొత్త సౌకర్యాలను తీసుకు రానుంది గీతా ప్రెస్. దీని ద్వారా కొత్త ఉద్యోగాల సృష్టి కూడా జరగనుంది. హిందూ సాహిత్యం విరివిగా వస్తుందని, డిమాండ్ ను తీర్చడంలో దీర్ఘకాలికంగా సవాల్ ను ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు ఈ సవాల్ ను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. రామ చరిత మానస్, సుందర కాండ, భారతం, భాగవతం లాంటి గ్రంథాలకు దేశ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ వుంది. గీతా ప్రెస్ భారతదేశం అంతటా దాని 20 శాఖలను కూడా సరఫరా చేయడంలో తరచుగా ఇబ్బంది పడుతోంది.

ప్రస్తుతానికి గీతా ప్రెస్ సంవత్సరానికి 3 కోట్ల పుస్తకాలను ప్రచురిస్తోంది. కానీ డిమాండ్ ఇంత కంటే ఎక్కువగానే వుంది. పది ఎకరాల స్థలం కేటాయింపుతో ఉత్పత్తి పెరిగి, డిమాండ్ ప్రకారం సాహిత్యాన్ని సరఫరా చేయడంలో సఫలం అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొత్తగా కేటాయించిన స్థలంలో పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించడానికి నాలుగు సంవత్సరాలు పడుతుందని అంచనా వేశారు. అయితే.. సాధ్యమైనంత వేగంగానే ఉత్పత్తిని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రారంభ దశల్లో భూమిని నమోదు చేయడం, సరిహద్దు గోడను నిర్మించడం మరియు కొత్త యంత్రాల సంస్థాపన కోసం ప్రణాళిక వేయడం వున్నాయి.
ప్రస్తుతం గీతా ప్రెస్ 15 భాషలలో 1,848 విభిన్న శీర్షికలను ప్రచురిస్తుంది, రోజుకు సుమారు 70,000 పుస్తకాలను ఉత్పత్తి చేస్తుంది, మార్కెట్ డిమాండ్ రోజుకు 1 లక్షకు దగ్గరగా ఉంది.ఈ ప్రెస్ ప్రతి నెలా దాదాపు 500 టన్నుల కాగితాన్ని ఉపయోగిస్తుంది, జపాన్, జర్మనీ మరియు ఇటలీ నుండి దిగుమతి చేసుకున్న యంత్రాలతో ఆఫ్‌సెట్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
ఈ రోజు వరకు, గీతా ప్రెస్ 100 కోట్లకు పైగా పుస్తకాలను ప్రచురించింది, వాటిలో దాదాపు 18.75 కోట్ల గీత కాపీలు మరియు తులసీదాస్ రాసిన రామచరితమానస్ మరియు ఇతర రచనల 13.25 కోట్ల కాపీలు ఉన్నాయి. అందర్నీ చేరుకోవడానికి గీతా ప్రెస్వెబ్‌సైట్ ప్రస్తుతం దాదాపు 500 పుస్తకాలను ఉచితంగా అందిస్తోంది, అన్ని ప్రచురణలను కాలక్రమేణా ఉచితంగా అందుబాటులో ఉంచాలనే ప్రణాళికలతో ఉంది. అదనంగా, ‘గీత సేవ’ యాప్ బహుళ భాషలలో అనేక పుస్తకాలు మరియు మత గ్రంథాలను ఉచితంగా యాక్సెస్ చేస్తుంది.





