
128views
జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలకు జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని విద్యార్థులు, యువ కళాకారులకు మూడు రంగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అవి.. ‘సమృద్ధి కా మంత్ర, ఆత్మనిర్భర్ భారత్’పై చిత్రలేఖనం, ‘స్వతంత్రత కా మంత్ర, వందేమాతరం’పై వ్యాసరచన, వందేమాతర గేయంపై పాట. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు, పౌరులు శాస్త్రీయ, జానపద రీతిలో వందేమాతరం గేయాన్ని పాడిన అనంతరం వీడియోను ల్వీబ్ని్ర వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీడియో వ్యవధి రెండు నిమిషాలకు మించకూడదని పేర్కొంది. అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శనకు బహుమతులు అందజేస్తారు.





