
అనంతపురం జిల్లా విశ్వ హిందూ పరిషత్ కళ్యాణదుర్గము ప్రఖండ ఆధ్వర్యంలో స్వచ్చంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ శ్రీమతి డాక్టర్ ప్రసన్న భారతి గారు ఈ శిబిరాన్ని ప్రారంభించగా 61 మంది రక్త దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. హె.డి.యఫ్.సి. బ్యాంక్ మేనేజర్ శ్రీ సుధాకర్ గారు మరియు సిబ్బంది రక్త దాతలకు ఆపిల్ పండ్లను ఇచ్చి రక్త దాతలను ప్రోత్సహించారని విశ్వ హిందూ పరిషత్ కళ్యాణదుర్గం ప్రఖండ కార్యదర్శి మేడా నాగభూషణం తెలిపారు. అతి ముఖ్యమైన సేవ రక్త దానమని, కావున రక్త దాతలందురు స్వచ్చందంగా బ్లడ్ బ్యాంక్ కు వచ్చి రక్తదానం చేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఇది అందరూ చేయలేరు కాబట్టి రక్త దాతలు ,స్వచ్చంధ సంస్థలు, ప్రజా సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో వేపులపర్తి శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు భోజన సౌకర్యం ఏర్పాటు చేసి సహకరించారు. అలాగే దుర్గం రక్త దాతల వ్యవస్థాపకులు శ్రీ తిమ్మారెడ్డి గారు ఈ శిబిరాన్ని పర్యవేక్షణ చేసి మద్దతుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ జి.వి.రమణ గారు , కళ్యాణదుర్గము ప్రఖండ మరియు ఖండ సభ్యులందరూ పాల్గొన్నారు.





