
91views
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ధారకొండ పరిసర ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతానికి వై.రామవరం మీదుగా తరలిస్తున్న 32 గోవులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించినట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా మండలంలోని యార్లగడ్డ పంచాయతీ కొమరవరం జంక్షన్ వద్ద పశువులను తరలిస్తూ రెండు వ్యాన్లు పట్టుబడ్డాయన్నారు. వీటిని గోకవరం సమీపంలోని గోశాలకు అప్పగించామన్నారు. అనుమతి లేకుండా గోవులను తరలిస్తే చర్యలు తప్పవని తెలిపారు. రెండు వ్యాన్లను స్వాధీనం చేసుకోవడమే కాకుండా అక్రమంగా తరలిస్తున్న నెల్లిపూడికి చెందిన నేమాల లోవరాజు (45), కామరాజుపేటకు చెందిన అమృత శ్రీను(40), బొందల శ్రీను(38)పై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.





