News

ప్రపంచంలోనే ఎత్తయిన సహజసిద్ధ శివలింగం

219views

ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రాల్లో అరుణాచల్‌ప్రదేశ్‌ ఒకటి. ఇక్కడి జిరో ప్రాంతం అనేక రమణీయ దృశ్యాలకు నెలవు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సహజసిద్ధ శివలింగం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. దీని ఎత్తు దాదాపు 25 అడుగులు. కర్దావ్‌ కొండపై సిద్ధేశ్వర్‌నాథ్‌ మందిరంలో ఈ శివలింగం కొలువై ఉంది. లింగం అడుగు భాగంలో నిరంతర నీటి ప్రవాహాన్ని గంగాదేవిగా భావిస్తుంటారు. దీనిని గుర్తించడం వెనుక ఓ ఆసక్తికర కథనాన్ని స్థానికులు చెబుతుంటారు. 2004లో ఓ నేపాలీ వ్యక్తి అక్కడ చెట్లు నరుకుతూ.. ఆ కొమ్మలు ఓ ఎత్తయిన రాయిపై పడతాయని భావించాడు. కానీ అవి అనూహ్యంగా దూరంగా పడటం చూసి ఆశ్చర్యపోయాడు. దాంతో ఆ రాయికి ఏదో అసాధారణ శక్తి ఉందని గ్రహించాడు. ఈ క్రమంలోనే శివలింగం వెలుగులోకి వచ్చింది.